Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కూడా మల్బరీ జాతికి చెందిన డ్రై ఫ్రూట్. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.  ముఖ్యంగా అజీర్తి, గొంతు నొప్పి సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాదు అంజీర్ పండులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన డైట్లో చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అయితే అంజీర్ పండు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్స్ కలుగుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబర్ పుష్కలం..
అంజీర్ పండు నానబెట్టిన నీళ్లు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు మలబద్ధకం తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంజీర్ పండ్లు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కనిపిస్తుంది కాబట్టి అతిగా తినకుండా ఉంటారు బరువు పెరగరు.


యాంటీ ఆక్సిడెంట్స్..
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి .ముఖ్యంగా ఫీనాల్స్, ఫ్లవానాయిడ్స్ వంటివి ఉంటాయి. నానబెట్టిన అంజీర్ పండ్ల నీటిని  తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. దీంతో ప్రాణాంతక గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


బ్లడ్ షుగర్ లెవెల్స్..
అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో వచ్చే ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయి.


ఇదీ చదవండి: అతిగా చక్కెర తింటే అనర్థాలే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..


గుండె ఆరోగ్యం..
అంజీర్ పండులో ఉండే ఆరోగ్యానికి సహాయపడే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా పెరగకుండా కాపాడుతుంది. పొటాషియం, సోడియంకి వ్యతిరేకంగా పనిచేసే గుణం కలుగుతుంది. కాబట్టి కార్డియో సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి అంజీర్ నానబెట్టిన నీళ్లు సహాయపడతాయి.


ఇదీ చదవండి: గుడ్డుతోపాటు ఈ 4 ఆహారాలు కలిపి తింటున్నారా? మీరు పొరపాటు చేసినట్టే..


ఇమ్యూనిటీ..
అంజీర్ పండునులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కే, విటమిన్ ఏ క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్ ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి