Excess Sugar intake symptoms: చక్కెర అందరూ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు. ఏ శుభకార్యాలు జరిగిన నోట్లో చక్కెర వేసుకునే ఆనవాయితీ కూడా మన హిందూ సంప్రదాయంలో ఉంది. అలాంటి చక్కెరతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు చక్కెరకు దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిపుణుల సలహా ప్రకారం కూడా షుగర్ కి దూరంగా ఉండటం మంచిది. కేకులు, చాక్లెట్స్, బ్రౌని షుగర్ ఎక్కువ శాతం లో ఉంటుంది చాలామంది ఎక్కువ శాతం షుగర్ తీసుకుంటున్నారు .దీంతో శరీరం పై తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి అయితే షుగర్ ఎక్కువగా తినే వారికి ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తాయంట అవేంటో తెలుసుకుందాం
అతిగా చక్కెర తినాలనిపించడం..
షుగర్ ఎక్కువగా తింటున్న వారిలో ప్రతిరోజు మరింత చక్కర తినాలనే కోరిక కనిపిస్తుందట. దీనివల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోతాయి అంతేకాదు చెక్కర అధికంగా తీసుకోవడంల వల్ల రక్తపోటు కూడా వస్తుంది.
గుండె ఆరోగ్యం..
ఒక నివేదిక ప్రకారం చక్కర అధిక మోతాదులో తీసుకున్న వారికి రక్తప్రసరణంలో ఇన్సులిన్ ప్రభావం చెందుతుంది. ఇది అర్టెరీ బ్లాక్ కి దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు వస్తాయి. అంతేకాదు తెల్ల చక్కెర ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండుపై కూడా అధికంగా భారం పడుతుంది హార్ట్ ఎటాక్ స్ట్రోక్ లకు కారణం అవుతుంది.
ఇదీ చదవండి: గుడ్డుతోపాటు ఈ 4 ఆహారాలు కలిపి తింటున్నారా? మీరు పొరపాటు చేసినట్టే..
స్కిన్ హెల్త్..
అధిక మోతాదులో షుగర్ తినేవారిలో స్కిన్ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంటే త్వరగా వృద్ధాప్యం రావడం వంటివి కనిపిస్తాయి. రక్త సరఫరా లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ అవుతుంది ఇది స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది.
మెదడు ఆరోగ్యం..
అధిక మోతాదులో షుగర్ వేసుకోవడం వల్ల ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మన మెదడులో డొపమైన్ విడుదలకు దారితీస్తుంది. పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల డోపమైన్ సమస్య ఉండదు కానీ చక్కెర తీసుకోవడం వల్ల వెంటనే ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్‌ను ఈ 5 కూరగాయలు క్షణాల్లో బయటకు తరిమేస్తాయి..
మూడ్..
చక్కర అధిక మోతాదులో తీసుకున్న వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి పోతాయి ఇది యాంగ్సైటిని పెంచుతాయి. మానసిక సమస్యల కూడా కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి