EGG Storing: కోడిగుడ్లను భద్రపరచడానికి సూపర్ ఐడియాస్.. ఎన్ని రోజులైనా పదిలం
Egg Preservation:చాలామందికి ఎప్పటికప్పుడు సామాను తెచ్చుకోవాలి అంటే టైం సరిపోదు. హడావిడిగా ఆఫీసులకు వెళ్లి వచ్చే వాళ్ళకి అస్సలు కుదరదు. మరి ఇలాంటి అప్పుడు ఒకేసారి ఎక్కువగా తెచ్చి భద్రపరచుకుంటే పాడైపోతాయి అని చాలామంది భయపడే వస్తువు కోడి గుడ్డు. కానీ మీకు ఆ భయం అస్సలు అక్కర్లేదు ఎందుకంటే గుడ్లను సులభంగా భద్రపరచుకునే ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి. మరి అవి ఏమిటో చూద్దాం పదండి.
Eggs Storage Ideas: మనలో చాలామంది వారానికి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చి పెట్టుకోవడానికి ఇష్టపడతారు. హడావిడిగా ఆఫీస్ కి వెళ్లేవాళ్లు.. పిల్లలు స్కూల్కు వెళ్లేవాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు బజారుకు వెళ్లి తెచ్చుకోవాలి అంటే కష్టమవుతుంది కాబట్టి ఎక్కువగా తెచ్చి నిలువ చేసుకుంటాము. ఇలా ఎక్కువగా తెచ్చి నిలువ చేసుకొని వస్తువులలో ఒకటి కోడిగుడ్డు.
కోడి గుడ్లు లో విటమిన్ ఏ, బీ6, బీ12, సెలీనియం పుష్కలంగా లభించడంతోపాటు ప్రోటీన్ కూడా శరీరానికి ఎక్కువగా అందుతుంది. పైగా కోడిగుడ్లు ఇంట్లో ఉంటే లంచ్ కి ఆమ్లెట్ దగ్గర నుంచి టిఫిన్ కి బ్రెడ్ శాండ్విచ్ వరకు ఏదైనా సులభంగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ ఇంట్లో గుడ్లు నిల్వ ఉండేలా చూసుకోవాలి అని భావిస్తారు.. కానీ గుడ్లు ఎక్కువగా తెచ్చుకుంటే పాడైపోతాయని భయపడతారు. అలాంటి వారి కోసం కోడిగుడ్లను ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ చేసుకుని ఈ టెక్నిక్స్..
ప్రపంచవ్యాప్తంగా కోడిగుడ్డును నిల్వ చేయడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని వినడానికే చాలా విచిత్రంగా ఉంటాయి.. కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చైనాలో గుడ్లను ఉప్పు మధ్య పెట్టి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు పాడుకాకుండా ఉంటాయని వారు నమ్ముతారు. ఈ పద్ధతిని సాల్టింగ్ కూడా అంటారు. మన పాత రోజుల్లో కూడా కళ్ళు ఉప్పు మధ్య గుడ్లను పెట్టేవారు. అలాగే చైనాలో వైన్ లో కూడా గుడ్లను వేసి నిల్వ చేస్తారు.
అంతేకాకుండా గాజు సీసాలో నీటిని నింపి గుడ్డును మెల్లిగా అందులో జార విడిచి గట్టిగా మూత పెట్టి రూమ్ టెంపరేచర్ వద్ద పెట్టుకోవచ్చు. ఈ టెక్నిక్ ద్వారా గుడ్లు సుమారు సంవత్సరం పాటు పాడుకాకుండా ఉంటాయట.గుడ్లు ఉడకపెట్టి వెంటనే తొక్క తీసుకొని తింటాం. కానీ హార్డ్ బాయిల్ చేసిన గుడ్లను తొక్కు తీయకుండా అలాగే ఫ్రిజ్లో పెడితే వారం రోజుల వరకు పాడు కావు. మనం తెచ్చుకునే 30 ,40 గుడ్లు ఫ్రిజ్లో పెట్టిన ఒక నెలపాటు చెడకుండా భద్రంగా ఉంటాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook