Foods to avoid before and after eating Papaya: బొప్పాయి.. అన్ని పోషకాలు కలగలిగిన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. ముఖ్యంగా తినడానికి రుచికరంగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా మనకు బొప్పాయిలో ప్రోటీన్,  మినరల్స్,  విటమిన్,  ఫైబర్,  ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. కాబట్టే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను మనకు కలిగిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా జబ్బుల నుండి కాపాడుతుంది కూడా. అయితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగించే బొప్పాయిని.. ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి.. కానీ ఈ బొప్పాయి తో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. పొరపాటున కూడా వీటిని తీసుకున్నామో.. లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.. మరి బొప్పాయితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 


కాఫీ , టీ , పాలు :


బొప్పాయితో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. వాటిలో కాఫీ , టీ,  పాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా బొప్పాయి తిన్న తర్వాత ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న వెంటనే వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకండి. ఇలా తాగడం వల్ల కొంతమందిలో కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. 


పెరుగు: 


బొప్పాయి , పెరుగు రెండూ ఒకేసారి తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బొప్పాయి , పెరుగు కాంబినేషన్ తినడం వల్ల బొప్పాయి వల్ల శరీరంలో వేడి పెరిగితే, పెరుగు వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల భరించలేని తలనొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


సిట్రస్ జాతి పండ్లు..


బొప్పాయి తోపాటు నారింజ,  ద్రాక్ష,  నిమ్మ వంటి సిట్రస్ పండ్లు కూడా తీసుకోకూడదు. ఒకవేళ కలిపి తీసుకుంటే ఎసిడిటీ ,గుండెల్లో మంట ,కడుపునొప్పి, విరోచనాలు వంటివి వస్తాయి. 


స్పైసీ ఫుడ్స్: 


బొప్పాయితో స్పైసీ ఫుడ్స్ కూడా కలిపి తీసుకోకూడదు.  బొప్పాయితో స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. అలాగే జీర్ణాశయాంతర సమస్యలు పెరుగుతాయి..  ప్రోటీన్ ను విచ్చినం చేసే ఎంజైమ్ ను కలిగి ఉంటుంది బొప్పాయి..  అందుకే బొప్పాయితో పాటు చేపలు,  మాంసం, గుడ్లు తదితర ప్రోటీన్ రిచ్ ఫుడ్లను తీసుకోకూడదు. ఇక ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.


Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం


Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి