Healthy Food: ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ లైఫ్ లో ఆనందంగా ఉండడం ఎంతో అవసరం. అయితే కొన్ని రకమైన ఆహారం తినడం ద్వారా ఆనందాన్ని పొందుతారని కొన్ని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్నారు. అటువంటి ఆహారాలను తిన్నప్పుడు మన ఒంట్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి మనల్ని సంతోషానికి గురిచేస్తాయట . మరి ఆ ఆనందకరమైన సంతృప్తికరమైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగన్నం 
ప్రతి ఒక్కరూ భోజనం చివరలో రెండు ముద్దలు అయినా పెరుగు అన్నం వేసుకుని తింటేనే భోజనం  పూర్తయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా పిల్లలకు చాలా ఇష్టమైనది ఈ పెరుగన్నం. కొంతమంది పెరుగన్నంలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఈ విధంగా తాలింపు వేసుకొని తింటుంటారు.ఇలా చేయడం వల్ల పెరుగన్నమనేది టేస్టీగా మారుతుంది, తిన్నప్పుడు మెదడుకు హాయిగా ఉంటుంది దాని వలన పెరుగన్నం తిన్నాక చాలామందికి ఆనందం కలుగుతుంది అని అంటున్నారు నిపుణులు.


బిర్యానీ 
బిర్యానీ వాసన వలన బిర్యానీని ఇష్టపడిన వారు అంటూ ఉండరు. ఆ బిర్యానీలో వాడే సుగంధ ద్రవ్యాల వల్ల సువాసన మెదడుకు ఉత్తేజాన్ని కల్పిస్తుంది. అదే విధంగా దీనిని తినడం ద్వారా ఆనందకరమైన హార్మోన్లు ఉత్పత్తి పెరుగుతుంది. ఆ బిర్యానీ తిన్నంతసేపు తిన్నవారు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంటారు. అందుకే ఇది అందకరమైన భోజనంలో  ఒకటిగా మారింది.


మసాలా టీ 
మసాల టీ తాగినప్పుడు మన శరీరం అనేది ఉత్తేజంగా మారుతుంది. అదేవిధంగా సంతోషం కలుగుతుంది. దీనిలో ఉన్న సుగంధ ద్రవ్యాలు పాలు కలిగి ఉండడం వలన ఇది నాలుకపై  ఉండే రుచులను ఉత్పత్తి చేస్తుంది. ఆ సంతృప్తి మెదడుకు చేరడం వలన, ఈ టీ ని తాగినప్పుడు కొద్దిసేపు విశ్రాంతిగా ఓదార్పుగా  అనిపిస్తుంది. అందుకే చాలామంది దీన్ని తాగడానికి ఇష్టపడుతుంటారు.


దాల్ తట్కా 


దాల్ తట్కకు చాలామంది అభిమానులే ఉంటారు. దీనిని ఆహారంలోనూ చపాతీలోనూ చాలా వాటిలో తెలుసుకుంటూ ఉంటాము. ఇది మన ఆరోగ్యానికే కాదు మెదడు కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించి ఆనందకరంగా చేస్తుంది.


క్యారెట్ హల్వా


క్యారెట్ హల్వా అనేది పాలు చక్కెర యాలకులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్ వాటన్నిటినీ భాగంగా చేసి ఇది దీన్ని తాజా క్యారెట్ల తో తయారు చేస్తారు. ఈ క్యారెట్ హల్వా తింటున్నప్పుడు శరీరానికి మానసికంగా ప్రశాంత చేకూరుతుంది.అందువలన ఇది కూడా ఒక ఆనందకరమైన ఆహారాల్లో భాగమైంది. 


ఆలు పరాటా 


 పరాటా అన్నది గోధుమపిండి బంగాళాదుంప మిశ్రమంతో  తయారు చేస్తారు. ఇది చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అదేవిధంగా  తిన్నప్పుడు చాలా రుచికరంగాను  మనసుకు సంతృప్తిని కలిగిస్తుంది. అందువల్లే శరీరాన్ని ఆహ్లాదంగా ఉత్తేజంగా కలిగించే ఈ ఆలు పరాటాన్ని చాలామంది తినడానికి ఇష్టపడుతుంటారు.


కిచిడి 


ఈ కిచిడి అన్నది అన్నము కొన్ని కూరగాయలు పప్పులు కలిపి చేసే మిశ్రమము. దీన్ని తయారు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మన సంప్రదాయం వంటకాలలో కిచిడి ఒకటి. కిచిడి తినడం వల్ల మెదడుకు హాయిగా ఆనందంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆనందకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.


ఇక ఇవే కాకుండా చాక్లెట్లు ఎక్కువగా ఈ హ్యాపీ హార్మోన్స్ ని విడుదల చేస్తాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అంతేకాదు రోజు ఒక చిన్న బిట్ డార్క్ చాక్లెట్ తినడం ద్వారా గుండె జబ్బులు కూడా దూరంగా ఉంటాయి.


Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌


Also read: IMD Weather Alert: రానున్న 48 గంటల్లో భారీ మంచు, మోస్తరు వర్షసూచన, ఏయే రాష్ట్రాల్లో అంటే


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook