Side Effects of Garlic: మితిమీరిన మోతాదులో వెల్లుల్లి తింటే ఇక అంతే సంగతులు!
Garlic Side Effects: వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. వెల్లుల్లిని అందుకే ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా భావిస్తారు. వెల్లుల్లితో ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Side Effects of Excessive Garlic Taking: ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా లభించే ఓ విధమైన మసాలా పదార్ధం వెల్లుల్లి. రుచి కోసం వివిధ రకాల వంటల్లో వెలుల్లి వాడటం తప్పనిసరి అవుతుంటుంది. వెల్లుల్లితో శరీరానికి కావల్సిన పలు ప్రయోజనాలు తక్షణం కలుగుతాయి. కానీ మోతాదు మించి తింటే మాత్రం తీవ్రమైన నష్టం కలగవచ్చని తెలుస్తోంది
వివిధ రకాల వంటల్లో రుచి కోసం వెల్లుల్లిని తప్పకుండా వినియోగిస్తుంటారు. అదే సమయంలో వెల్లుల్లిని కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా వినియోగిస్తుంటారు. ఎందుకంటే వెల్లుల్లిలోని పోషక పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి న్యూట్రియంట్లు ఉన్నాయి. సాధారణంగా ఇన్ని పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమంటారు. నిజమే..కానీ వెల్లుల్లి మోతాదు దాటి తింటే మాత్రం ఆరోగ్యపరంగా హాని కలగవచ్చు. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లిని అద్భుతమైన ఔషధ ఖజానాగా భావిస్తారు. కానీ మోతాదు దాటితే మాత్రం తీవ్రమైన నష్టాలు కలుగుతాయి.
Also Read: Diabetes Diet: ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో మధుమేహామే కాదు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకైన చెక్..
వెల్లుల్లి మోతాదు దాటి తినడం వల్ల ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. వెల్లుల్లిలో ఎసిడిక్ కాంపౌండ్ ఉండటం వల్ల ఎక్కువ తిన్నప్పుడు ఛాతీలో మంట ఏర్పడే ముప్పు కచ్చితంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో భరించలేని పరిస్థితి కూడా ఉంటుంది.
వెల్లుల్లి స్వభావం వేడి చేసేది. అందుకే చలి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు వెల్లుల్లి రెమ్మలు నమిలి తింటుంటారు. అయితే కొంతమంది ఆరోగ్యానికి మంచిది కదా అనే ఉద్దేశ్యంతో అదే పనిగా తింటుంటారు. ఫలితంగా దుర్గంధం రావడమే కాకుండా ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడతాయి
రక్తపోటు తక్కువగా ఉండేవారికి అంటే లోబీపీ రోగులు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. లేకపోతే హైపర్ టెన్షన్ సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరంలో విపరీతమైన అలసట ఉంటుంది. సాధారణంగా వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తాలింపులో తప్పకుండా వినియోగిస్తుంటారు. ఏడాదికోసారి వేసే వివిధ రకాల పచ్చళ్లలో కూడా వెల్లుల్లి ఉపయోగిస్తుంటారు.
Also Read: Mustard Oil Benefits: రోజూ ఈ మిశ్రమాన్ని రాస్తుంటే 15 రోజుల్లోనే బట్టతల మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి