Ginger Remedies: శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానం మాత్రమే. అయితే ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాలను డైట్‌లో ఉంటే అద్భుతమైన లాభాలుంటాయి. అందులో ముఖ్యమైంది అల్లం. రోజూ పరగడుపున అల్లం ముక్క తింటే ఆరోగ్యపరంగా చాలా లాభదాయకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేద వైద్య విధానంలో అల్లంకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ఉండే వివిధ రకాల రసాయనాలు శరీరాన్ని అన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. రోజూ అల్లం కొద్దిగా తింటే రక్త నాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు అల్లం మంచి పరిష్కారం. ఎప్పుడైనా వికారం ఉన్నప్పుడు అల్లం ముక్క కొద్దిగా తింటే వెంటనే తగ్గుతుంది. కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. 


రోజూ క్రమం తప్పకుండా పచ్చి అల్లం తినడం వల్ల జీర్ణక్రియ అద్బుతంగా మెరుగుపడుతుంది. కడుపు మంట తగ్గుతుంది. మెటబోలిజం వేగవంతమౌతుంది. అల్లం రోజూ తినడం వల్ల గొంతులో గరగర, శ్వాస సమస్యలు అన్నీ తగ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో నొప్పుల్నించి ఉపశమనం లభిస్తుంది. 


Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి రానుంది, జీతభత్యాలు ఎంత పెరుగుతాయో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.