8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి రానుంది, జీతభత్యాలు ఎంత పెరుగుతాయో తెలుసా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

1 /6

8th Pay Commission: 2016 జనవరి నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చి అప్పుడే 8 ఏళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో గడువు ముగియనుంది. ఈ క్రమంలో 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పడ్డాక అమల్లోకి వచ్చేందుకు ఏడాదిన్నర రెండేళ్లు పడుతుంది. 

2 /6

7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేలుంటే గరిష్టంగా 2.5 లక్షలున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అటు పెన్షనర్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. 

3 /6

అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా 2025 ఫిబ్రవరిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఉండవచ్చని తెలుస్తోంది. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు కనీస వేతనం 9 వేల నుంచి 18 వేలకు రెట్టింపు పెరిగింది. 

4 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెద్దఎత్తున పెరగనుంది. డీఏ అనేది ప్రతి ఆరు నెలలకోసారి పెరుగుతుంటుంది. ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి 56 శాతం కావచ్చని అంచనా

5 /6

దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ సంఘాలు ఎప్పట్నించో 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అదే సమయంలో కొత్త వేతన సంఘాన్ని ప్రతి పదేళ్లకు కాకుండా ప్రతి ఐదేళ్లకోసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

6 /6

8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల కనీస వేతనం 18 వేల నుంచి 35 వేలకు పెరగనుంది. దాంతో డీఏ కూడా మరింత పెరనగుంది. అందుకే ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు.