Diabetes Remedy: డయాబెటిస్, మలబద్ధకం సమస్యను ఇట్టే దూరం చేసే పదార్ధం ఇదే
Diabetes Remedy: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వీటిల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ షుగర్ రోగులు పెరిగిపోతున్నారు.
Diabetes Remedy: డయాబెటిస్ వ్యాధిని నియంత్రించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మధుమేహం నియంత్రించే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఏవి ఎందులో ఉన్నాయో తెలుసుకుని వాడితే చాలు. అలాంటి గ్రీన్ మటర్. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉండే పదార్ధమిది.
రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ సమస్యను నియంత్రించవచ్చు. ఈ క్రమంలో తప్పకుండా డైట్‌లో ఉండాల్సింది గ్రీన్ మటర్. ఇప్పుడు చలికాలంలో గ్రీన్ మటర్ పెద్దఎత్తున లభిస్తుంది. గ్రీన్ మటర్ అనేది ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉండటమే కాకుండా రుచిలో కూడా బాగుంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. వివిధ రకాల ఇతర వ్యాధుల్ని దూరం చేస్తుంది. గ్రీన్ మటర్‌ను రోజూ ఉడికించి సూపర్ లో వేసి తినవచ్చు లేదా సలాడ్ రూపంలో లేదా కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు. చాలమంది రోటీలో గ్రీన్ మటర్ కూరను తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
గ్రీన్ మటర్ గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు దోహదం చేస్తుంది. గ్రీన్ మటర్‌లో ఉండే ఫైబర్ , ప్రోటీన్లు బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తాయి. గ్రీన్ మటర్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్రేవింగ్ తగ్గుతుంది. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ మటర్ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సగం కప్పు గ్రీన్ మటర్‌లో విటమిన్ ఎ రోజుకు కావల్సిన పరిమాణంలో 47 శాతం ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
గ్రీన్ మటర్ క్రమం తప్పకుండా డైట్‌లో ఉంటే ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. గ్రీన్ మటర్‌లో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీ అందిస్తాయి. కండరాల మరమ్మత్తుకు దోహదం చేస్తాయి..
Also read: AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.