AP Weather Forecast: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి తీరం దాటింది. ప్రస్తుతం ఇది బలహీనపడే దిశగా కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో రానున్న 48 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తుపాను తీరం దాటినా ఇంకా ఆ ప్రభావం కొనసాగనుంది.
పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుపాను ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య స్థిరంగా కొనసాగుతోంది. డిసెంబర్ 1వ తేదీ అంటే ఇవాళ మద్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో కడలూరుకు ఉత్తరాన విల్లుపురానికి 30 కిలోమీటర్లు, చెన్నైకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 4 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఫలితంగా వచ్చే మూడ్రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు సోమవారం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఇక దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవనున్నాయి. రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్ష సూచన ఉంది. బలమైన ఈదురుగాలులు వీయవచ్చు. గత 24 గంటల్లో తిరుపతిలో అత్యధికంగా 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also read: EPFO Big Decision: పీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, ఇక నుంచి అదనపు వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.