Green Tea Side Effects: గ్రీన్ టీ తాగడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గుతారని నమ్ముతారు. ఈ విధంగా ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే మీకు ఈ అలవాటు ఉంటే ఇకపై జాగ్రత్త వహించక తప్పదు. ఎందుకంటే అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదని నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీ అధికంగా సేవించడం వల్ల తలనొప్పి, నీరసం, బద్ధకం, చిరాకు వంటివి కలుగుతాయి. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే అనారోగ్యాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిద్రపై ప్రభావం


అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. శారీరక ఆరోగ్యం కోసం నిద్ర చాలా ముఖ్యమని చెబుతున్నారు. కాబట్టి గ్రీన్ టీని మితంగా తీసుకోవడం వల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉండదని తెలియజేస్తున్నారు. 


రక్తపోటు పెరిగే అవకాశం..


గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గ్రీన్ టీలోని కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తప్రసరణపై ప్రభావం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది.  


ఐరెన్ లోపం


గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అంతే కాకుండా.. ఆకలి కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల మీ శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో అమీరు అనేక వ్యాధులకు గురికావొచ్చు. 


ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే సమస్యలు


ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన్నే గ్రీన్ టీ తాగే ముందు ఏదైనా తింటే శ్రేయస్కరం. గ్రీన్ టీ లోని కెఫిన్ వల్ల తలనొప్పి, నీరసం, బద్ధకం, చిరాకు వంటివి కలుగుతాయి. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా నిపుణుల నుంచి గ్రహించినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. ఈ సమాచారాన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)


Also Read: Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!


Also Read: Sperm Count: పురుషుల్లో శుక్రకణాల లోపాలకు కారణాలేంటో తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.