Sperm Count: పురుషుల్లో శుక్రకణాల లోపాలకు కారణాలేంటో తెలుసుకోండి!

Sperm Count: ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేలాది మంది పురుషులు శుక్రకణాల లోపంతో బాధపడుతున్నారని చైనాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 07:59 AM IST
    • పురుషుల్లో క్రమంగా తగ్గుతున్న శుక్రకణాల సంఖ్య
    • వాయు కాలుష్యమే కారణమంటున్న అధ్యయనాలు?
Sperm Count: పురుషుల్లో శుక్రకణాల లోపాలకు కారణాలేంటో తెలుసుకోండి!

Sperm Count: ప్రపంచంలోని ఎక్కువ శాతం మంది పురుషులు అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది శుక్రకణాల లోపాలతో బాధపడుతున్నారు. దీని వల్ల సంతానం కోసం ఎదురుచూసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాప్యం కలుగువచ్చు. కొందరిలో బలహీనమైన స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ మొత్తంలో ఉండడమనేది.. మనం తినే ఆహారం, వాతావరణ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. నివసించే ప్రదేశాన్ని బట్టి కూడా శుక్రకణాల వృద్ధి ఉంటుందని ఆ నివేదిక వెల్లడిస్తోంది. 

యునైటెడ్ స్టేట్స్ లో 1970లో జరిపిన ఓ అధ్యయనంలో ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ లలో నివసిస్తున్న పురుషుల్లో శుక్రకణాల వృద్ధిరేటు తగ్గిపోయిందని తేలింది. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు మాత్రం వాయు కాలుష్యం కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం వారు అభిప్రాయపడ్డారు.  

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మెదడు నేరుగా జననేంద్రియాలపై ప్రభావం పడుతుంది. దీంతో కాలుష్యం సంతోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

జామా నెవార్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం.. చైనాలోని 130 ప్రాంతాలలో పురుషుల ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని సేకరించింది. సుమారు 34,000 మంది పురుషులు ఆయుర్దాయం పొందారు. వైద్యులు వారి స్పెర్మ్ కౌంట్, చలనశీలత, సాంద్రతను అంచనా వేశారు. అధ్యయనంలో పాల్గొనేవారిని వారి నివాస ప్రాంతంలోని వాయు కాలుష్యం ఆధారంగా నాలుగు గ్రూపులుగా విభజించారు.

నేరుగా ప్రభావం చూపుతుందా?

గాలి కాలుష్యం కారణంగా పురుషుల్లో శుక్రకణాలు దెబ్బతింటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ డెవలప్‌మెంట్ సమయంలో అధిక స్థాయి కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు స్పెర్మ్ చలనశీలతను ప్రభావితం చేస్తాయని పరిశోధనలో తేలింది. అయితే, వాయు కాలుష్యం స్పెర్మ్‌పై నేరుగా ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొనకపోవడం గమనార్హం.   

Also Read: Home Remedies: ఆధునిక జీవనశైలిలో..అనారోగ్య సమస్యలు..ఈ చిట్కాలు పాటించి చూడండి

Also Read: Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News