Green Tea: టైప్ 2 డయాబెటిస్‌కు ఇదే పరిష్కారం..ఎలా పని చేస్తుందంటే
గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ టీతో లాభాలు అనేకం. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అసలు గ్రీన్ టీ..డయాబెటిస్‌ను ఎలా తగ్గిస్తుందో తెలుసా..
గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ టీతో లాభాలు అనేకం. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అసలు గ్రీన్ టీ..డయాబెటిస్‌ను ఎలా తగ్గిస్తుందో తెలుసా..
గ్రీన్ టీ ( Green Tea ) ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సన్నబడటానికి ఎక్కువగా గ్రీన్ టీ వాడుతుంటారు. అయితే గ్రీన్ టీ కేవలం డైటింగ్ కోసమే కాదు..ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమని తెలుసా మీకు. గ్రీన్ టీ రోజూ సేవిస్తే..గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు ( Blood Pressure ) అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. Also read: Turmeric Milk: పసుపుపాలు తాగితే..ఇక ఆ సమస్య ఉండదు
టైప్ 2 డయాబెటిస్‌కు అద్భుత పరిష్కారం
టైప్ 2 డయాబెటిస్ ( Type 2 Diabetes ) ఉన్నవారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ ( kotekin ) అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మనిషి శరీరం..కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రిస్తాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బరువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ ( Insulin resistance ) తగ్గుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా వినియోగం అవుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది.
అలాగని అందరూ తీసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ( Gastric problem ), ఎసిడిటీ ( Acidity ), కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది.
డయాబెటిస్ ( Diabetes ) సమస్య ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ ఓ దివ్యౌషధమే అనడంలో సందేహం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. Also read: Vitamin C: ఉసిరిని ఇలా తింటే..కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు