Hair growth tips: జుట్టు సహజంగా పెరిగే మార్గాలు ఇవిగో..
Hair Care Tips: ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణం. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ జట్టు వేగంగా పెరగడానికి, బలంగా ఉండటానికి ఈ కింది చిట్కాలు పాటించండి.
Hair growth tips: ప్రతి ఒక్కరు పొడవాటి జట్టు, ఒత్తైన జట్టు ఉండాలని కోరుకుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగానో, హార్మోన్ల అసమతుల్యత వల్లో, సరైన ఆహాం తీసుకోకపోవడం, వివిధ కారణాల వల్ల జట్టు దారుణంగా (hair fall) రాలిపోతుంటుంది. అయితే, జుట్టు సమస్యలను అధిగమించడానికి, జుట్టు వేగంగా పెరిగేలా (Hair growth tips) చేయడానికి మీ జేబులో రూపాయి కూడా ఖర్చుచేయనవసరం లేదు. దీనికి కొన్ని రకాల సహజ పద్దతులున్నాయి. మరి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే చిట్కాలేంటో చూద్దాం..!
1. కలబంద జ్యూస్ (Aloe Vera Juice)
అలోవెరాలో పెద్ద మొత్తంలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది చనిపోయిన చర్మ కణాలు, వెంట్రుకల కుదుళ్లను రిపేర్ చేస్తుంది. ఫలితంగా జుట్టు వేగంగా పెరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు కలబంద జ్యూస్ (Aloe Vera Juice) తాగండి.
2. బాదం, అరటిపండు తినండి..
బాదంలో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధి ఉంటాయి. తద్వారా జట్టు ఊడిపోకుండా ఉంటుంది. బాదం పప్పులో లభించే విటమిన్ ఇ.. కెరాటిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. మరోవైపు మన జుట్టుకు పోషణ కోసం అధిక మొత్తంలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్‌లను అరటిపండ్లు అందిస్తాయి. పాలలో కొన్ని నట్స్, సీడ్స్, దాల్చిన చెక్క పొడి, తేనెతో పాటు బాదం, అరటిపండు వేసి స్మూతీని తయారు చేసి తాగండి..మంచి ఫలితం ఉంటుంది.
Also Read: Immunity Power: రోగ నిరోధక శక్తి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ, కారణాలేంటి
3. ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకోండి..
మన జుట్టు 95% కెరాటిన్ (ప్రోటీన్) మరియు 18 అమైనో ఆమ్లాలు (ప్రోటీన్ల బిల్డింగ్ బ్లాక్‌లు)తో రూపొందించబడింది. కాబట్టి మీ ఆహారంలో ప్రొటీన్లను ఎక్కువగా తీసుకుంటే మీ జట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్లు, చికెన్, పౌల్ట్రీ, పాలు, జున్ను, గింజలు, పెరుగు, క్వినోవాలో ఈ ప్రోటీన్లు పెద్ద మెత్తంలో ఉంటాయి.
4. బార్లీనీరు తాగండి (Barley Water)
బార్లీలో ఇనుము, రాగి పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని (red blood cells) ప్రేరేపిస్తుంది. అదే విధంగా జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఈ అద్భుతమైన హోం రెమెడీని తయారు చేయడానికి మీరు పొట్టు బార్లీ లేదా పెర్ల్ బార్లీని ఉపయోగించవచ్చు. బార్లీని నీటిలో నానబట్టి, ఉప్పు వేసి సుమారు అరగంట పాటు ఉడకబెట్టాలి. గ్యాస్ ఆపేసి అందులో నిమ్మ తొక్క , తేనె కలపి తీసుకుంటే మీ జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
5. మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోండి ( Fenugreek Spice)
మెంతి గింజలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి పెద్ద మెుత్తంలో ఉంటాయి. అదే విధంగా పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి దోహాదపడతాయి. మీరు ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తినవచ్చు లేదా మీ వంటకాలలో మసాలాగా (Fenugreek Spice) వేసుకుని తినవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook