Immunity Power: కరోనా మహమ్మారి సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి ప్రాధాన్యత లేదా అవసరం గురించి తెలుస్తోంది. అసలీ రోగనిరోధక శక్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ కారణమేంటో తెలుసుకుందాం.
మహిళలు, పురుషుల శరీర నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది. హార్మోన్లు కూడా భిన్నంగానే ఉంటాయి. భౌతికంగా చూస్తే మహిళల కంటే పురుషులు బలంగా ఉంటారు. శరీర నిర్మాణం అటువంటిది. భౌతికంగా పురుషులు బలంగా ఉన్నా సరే..ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం మహిళలే బలంగా ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే..మహిళల్లో రోగ నిరోధక శక్తి అధికమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బహుశా అదుకే అనారోగ్యం నుంచి మహిళలు త్వరగా కోలుకుంటారని తెలుస్తోంది.
సంతానోత్పత్తికి ప్రదాన కారణం మహిళలే. ఈ కారణంతోనే పురుషుల కంటే మహిళల్లో ఇమ్యూనిటీ (Immunity Power) అధికంగా ఉంటుందనేది ఓ విశ్లేషణ. ప్రమాదకరమైన రోగాలు, అంటువ్యాధుల్ని దూరం చేసే ఇమ్యూనిటీ మహిళల్లో ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం జన్యు నిర్మాణంలో వచ్చిన మార్పని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధమైన జెనెటిక్ స్ట్రక్చర్‌నే మైక్రో ఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ఇవి మహిళల ఎక్స్ క్రోమోజోమ్‌పై ఉంటాయి. మైక్రో ఆర్ఎన్ఏలు (Micro RNA) ఇమ్యూనిటీని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి చాలా రకాల అంటువ్యాధులు, వివిధ రోగాల్నించి త్వరగా కోలుకునేలా చేస్తాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్స్, ఎల్లో ఫీవర్, ఫ్లూ, డెంగ్యూ వంటి రోగాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో ప్రొటెక్టివ్ యాంటీబాడీలు (Antibodies) ఎక్కువగా విడుదలయ్యేందుకు మైక్రో ఆర్ఎన్ఏలు దోహదం చేస్తాయి. మహిళల్లో టి సెల్ యాక్టివేషన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషుల కంటే మహిళల్లో ఇమ్యూనిటీ ఎక్కువని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
Also read: IT Refund Status: మీ ఇన్‌కంటాక్స్ రిఫండ్ వచ్చిందా, రాలేదా..ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.