Guava Benefits: ప్రకృతిలో లభించే వివిద రకాల పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయి, జామ, ఆరెంజ్, ఆపిల్, బత్తాయి, నిమ్మ, దోసకాయ, పుచ్చకాయ, అరటి, సపోటా, మామిడి ఇలా ఎన్నో రకాల పండ్లను ఇవ్వడం ద్వారా ప్రకృతి మన ఆరోగ్యానికి కారణమయ్యే అన్ని రకాల పోషకాల్ని ఇస్తుంటుంది. వీటిలో ప్రధానమైంది జామ కాయలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాంపండు లేకా జాంకాయలు నిస్సందేహంగా ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాల్సిన మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా జాంకాయలు తినడం చాలా మంచిది. జాంకాయల్లో ఉండే అద్భుతమేంటంటే తినే సమయాన్ని బట్టి దాని విలువ మారుతుంటుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. జాంకాయలు ఉదయం పూట తింటే కలిగే ప్రయోజనాల విలువ బంగారంతో సమానం. అదే మద్యాహ్నం తింటే కలిగే ప్రయోజనాల విలువ వెండితో సమానం. ఇక రాత్రి వేళ తింటే కలిగే ప్రయోజనాల విలువ బ్రాంజ్  తో సమానమంటారు. అంటే ఉదయం తినడం అన్నింటికంటే అద్భుతమైంది. ఉదయం పూట తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. 


జాంకాయలు లేదా జాంపళ్లు కడుపుకి చాలా మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలుంటే తొలగిపోతాయి. రోజూ ఉదయం పూట తింటే ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుంది. రోజూ జాంకాయలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ. అందుకే ఎనీమియా లోపముండేవాళ్లు రోజూ జాంకాయలు తింటే చాలా మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు తగ్గుతుంది. శరీరంలో కణితి ఏర్పడే ప్రక్రియను ఆపగలుగుతుంది. జామలో పైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. అదే సమయంలో ఇమ్యూనిటీ బలపడుతుంది.


తెల్లజామ కంటే ఎర్ర జామలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే రోజూ ఇవి తినడం అలవాటు చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఎర్రజామ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక వీటన్నింటికీ తోడు రోజూ జాంకాయలు తింటే పంటి సంబంధింత సమస్యలు, చిగుళ్ల సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. పంటి సమస్యలను, చిగుళ్ల సమస్యల్ని జాంకాయలు అద్భుతంగా తగ్గించగలుగుతాయి. జాంకాయలే కాదు..లేత జామాకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.


Also read: Sleep Time: మనిషి నిద్ర ఎందుకు అవసరం, ఏ సమయంలో నిద్రపోవడం మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook