Clapping therapy: ఎవరినైనా మెచ్చుకోవాలి అన్నా ..అభినందించాలన్నా.. మనం మోగించేవి చప్పట్లు. అయితే ఈ చప్పట్లు వెనుక ఒక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. మీరు పార్క్ లో వాకింగ్ కి వెళ్లేటప్పుడు గుంపుగా జనాలు నిలబడి గట్టిగా నవ్వుతుంటారు చూడండి.. అదేనండి లాఫింగ్ థెరపీ.. అలాగే క్లాపింగ్ థెరపీ అని కూడా ఒకటి బాగా రీసెంట్ గా ఫేమస్ అయ్యింది. పైగా దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంట.. మరి అవి ఏమిటో చూద్దాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన శరీరంలో అవయవాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా అరచేతుల లో రక్తనాళాలు, నరాలు చివరలు ఉంటాయి.. వాటిని ఉత్తేజపరిస్తే  మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి.  క్లాపింగ్ థెరపీ…అదే చప్పట్లు కొట్టడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆందోళన, స్ట్రెస్ నియంత్రించడానికి చప్పట్లు కొట్టడం ఒక మంచి మార్గం. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి క్లాపింగ్ థెరపీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.


క్లాపింగ్ థెరపీ వల్ల  రక్తపోటు సాయి కంట్రోల్ లోకి రావడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు శరీరంలో రక్తప్రసరణ మెరుగుగా జరుగుతుంది. పైగా దీనివల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


అంతేకాదు బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత మెరుగవుతుంది. ఇక చప్పట్లు కొట్టడం ఒక ఎక్సర్సైజ్ లాగా చెయ్యడం ద్వారా వెయిట్ తగ్గడం అలానే మన జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుందట. 


మంచిది కదా అని అదే పనిగా కొట్టేరు.. అది కూడా ప్రమాదమేనండోయి. క్లాపింగ్ థెరపీ కి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆచరించే ముందు అవేమిటో క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి