Health Benefits Of Eating Carrots: ఇతర కూరగాయలు, దుంపల తరహాలోనే మనం క్యారెట్‌ను తింటున్నాం. అయితే వాటికన్నా భిన్నంగా క్యారెట్‌ను నేరుగా తినవచ్చు. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. ఏదేమైతేనేం క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ మీ దరిచేరకుండా చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ముఖ్యంగా ఉదయం వేళనే పరగడుపున (ఖాళీ కడుపుతో) క్యారెట్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు(Vitamin), ఫైబర్‌‌లు పుష్కలంగా లభిస్తాయి. కంటి చూపు మెరుగు చేయడంతో పాటు జట్టు పొడి బారకుండా చేస్తుంది. రోగ నిరోధకశక్తి(Immunity)ని సైతం పెంచడంలో క్యారెట్ కీలకపాత్ర పోషిస్తుంది.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..



క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు(Benefits Of Eating Carrots)
- క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.


- ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది


- మీరు రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది


Also Read: Benefits Of Pranayama: ప్రాణాయామం చేస్తే ఈ సమస్యలు పరార్!



- క్యారెట్ ద్వారా లభించే సోడియం అధిక రక్తపోటును(High Blood Pressure) నియంత్రిస్తుంది. 


- క్యారెట్‌లో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టును పొడిబారకుండా సంరక్షిస్తాయి.


- అజీర్తి సమస్య ఉన్నవారు తరచుగా క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.


Also Read: Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook