Weight Loss: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల జీవితం మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ గందరగోళంలో మనం తీసుకునే ఆహారంపై మనకు అస్సలు నియంత్రణ లేకుండా పోతుంది. ఈ కారణం చేత చిన్న వయసు నుంచే గ్యాస్ట్రిక్ సమస్య ,ఊబకాయం ప్రజల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.. తెలిసిన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మనం ఆ విషయాన్ని పట్టించుకోము.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా మరుగున పడిపోతున్న ఒక పాత పద్ధతి రోజు పొద్దున పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం. అనాదిగా..మనం తినే అన్నం తొలి ముద్దలో రెండు వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని తినమని మన పెద్దలు చెబుతూ వచ్చేవారు. అది చాదస్తం అనుకున్న వాళ్లే తప్ప దాని వెనక ఉన్న సైన్సు గురించి ఎవరు ఆలోచించలేదు. అసలు వెల్లుల్లి పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అందులోనూ పరగడుపున తింటే మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం పదండి.


మన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి అంటే మంచి డైట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారానికి రుచి పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే పదార్థమే వెల్లుల్లి. అలాంటి వెల్లుల్లి పొద్దున ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మనల్ని మనం అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాము. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ సైతం సోకే ప్రమాదం తప్పిస్తుంది వెల్లుల్లి.


వెల్లుల్లిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లాంటి తత్వాల కారణంగా మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకదు. పైగా రోజు పొద్దున ఖాళీ కడుపున ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోగలిగితే మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడంతో పాటు పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు కరుగుతుంది. ఇది తీసుకునే వాళ్ళకి జీర్ణక్రియ మెరుగుగా పని చేస్తుంది కాబట్టి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి.


డిప్రెషన్,నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా వెల్లుల్లి మంచి మందుగా పనిచేస్తుంది. రోజు పచ్చి వెల్లుల్లి తినేవారికి రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మరి ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్స్ ఇలా వెల్లుల్లి తినడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారు. చిన్నపిల్లలలో ఇది ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తుంది. అయితే వెల్లుల్లి పచ్చిగా తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు తొక్కు తీసిన వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో నానబెట్టుకోవాలి. ఇలా రెండు రోజులు తేనెలో ఊరిన తర్వాత వెల్లుల్లి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పరగడుపున దీన్ని ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..


Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter