నేటి ఉరుకులు పరుగుల జీవనంలో కడుపునిండా తిని, ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు ప్రతీ వంటకూ వంకలు పెట్టి అసలు ఏవీ తినడానికి ఇఫ్టపడరు.  అలాంటివాటిలో ఉప్మా ఒకటి. అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ  గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది.  ఉప్మాయే కాదు.. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికం. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం.


* గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.


* రవ్వ ఉప్మా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి మైండ్‌లోకి కూడా రాదు.


* ఉదయాన్నే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు టిఫిన్‌గా తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇందులో అవసరమైన పోషకాలు లభిస్తాయి.


* షుగర్ ఉన్నవారికి ఇది సరైన ఆహరం. దీంట్లోని పదార్థాలు శరీరంలోని చక్కర స్థాయిని నియంత్రించి అదుపు చేసే అవకాశం ఉంది.


* ఉప్మా తీసుకోవడం వల్ల శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో ఇది ఔషధంలా కూడా పనిచేస్తుంది