Health Benefits of Milk: ఓవైపు గత ఏడాది నుంచి కరోనా లాంటి మహమ్మారితో పోరాడుతున్నాం. మరోవైపు తీరికలేని జీవితంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో మీకు బలాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలి. అందులో మీకు పాలు ఒకటి. పాలు తాగడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సలహా ఇస్తారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉంటారనే విషయం కేవలం కొందరికే తెలుసు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరండి:
చాలా మందిని వేధించే సమస్యలలో మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకటి. ఈ అనారోగ్య సమస్యలు దూరం చేసుకునేందుకు పాలు దోహదం చేస్తాయి. జీర్ణక్రియకు పాలు మంచి ఎంపికగా భావిస్తారు. కనుక ఎవరికైనా మలబద్ధకం, జీర్ణ సమస్య ఉంటే అలాంటి వ్యక్తులు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు(Milk Benefits) తాగడం శ్రేయస్కరం.


Also Read: COVID-19 Vaccine: కరోనా టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది


రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగ నిరోధకశక్తి పెరిగితే అది మిమ్మల్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మీరు మీ పనులను ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా సులువుగా పూర్తి చేసుకోవచ్చు. కనుక రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


గొంతు నొప్పి దూరం
ఒక గ్లాసు వెచ్చని పాలు తాగితే మీకు కాస్త చలువ చేస్తుంది. ఒంట్లో వేడిమిని దూరం చేస్తుంది. వీటితో పాటు వేడి పాలను తాగితే గొంతు నొప్పి లాంటి సమస్యలకు పరిస్కారం చూపుతుంది. వేడి పాలలో కొన్ని మిరియాలు, పసుపు వేసుకుని తాగితే మీ గొంతునొప్పికి ఉపశమనం ఇస్తుంది.


Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు


పురుషులకు మేలు:
ప్రతిరోజూ పాలు తాగితే పురుషులకు పలు ప్రయోజనాలున్నాయి. మగవారు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు పాలు తాగితే హార్మోన్లు చురుకుగా పని చేస్తాయి. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్లు తగినంత లభిస్తాయి. పాలలో ఉండే కాల్షియం, సోడియం మరియు పొటాషియం మీ శరీరంలోని విషపదార్థాలను దూరం చేస్తాయి. అందువల్ల నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు తాగాలని చెబుతారు.


ఒత్తిడి మరియు అలసట దూరం:
నేటి ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగులతో ఒత్తిడి మరియు అలసట సమస్యగా మారతాయి. అందుకు అధిక ఒత్తిడికి గురైరా లేదా అలసట ఉన్నట్లు అనిపించినా, వెచ్చని పాలతో మీ ఒత్తిడి, చిరాకు దూరం అవుతాయి.


Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి


ప్రశాంతంగా నిద్ర:
మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే తగినన్ని గంటలు నిద్రపోవాలి. అయితే నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు తాగితే మీకు ప్రశాంతంగా నిద్ర(Sleeping At Afternoon) వస్తుంది. ఉదయం నుంచి ఉన్న ఒత్తిడి, అలసట తగ్గడం, కాల్షియం లభిస్తాయి కనుక మీరు ఏ చింత లేకుండా నిద్రిస్తారు.



గమనిక: మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శరీరం లక్షణాలు పరిశీలించి వైద్యులు సలహాలు తీసుకుని మాత్రమే వాటిని పాటించాలి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook