Health benefits of soaked chia seeds: చీయాసీడ్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇందులో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణ ఆరోగ్యం..
చీయా సీడ్స్‌ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక స్పూన్‌లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. పేగు కదలికలకు కూడా ప్రేరేపిస్తాయి. అంతేకాదు గట్‌ హెల్త్‌, ఇమ్యూనిటీ కూడా ప్రోత్సహిస్తుంది.


ఇన్ల్ఫమేషన్..
చీయా సీడ్స్‌ లో ఓమేగా ౩ ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగ ఉఉంటాయి. ఇందులో ఉండే ఆల్ఫా లైనొలెనిక్‌ యాసిడ్‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది కార్డియోవాస్క్యూలర్‌ రోగాలు, షుగర్ కొన్ని రకాల కేన్సర్ వ్యాధాఉలకు ఇన్ఫ్లమేషన్ కారణం.


ఇదీ చదవండి: బీట్‌రూట్‌ ఆకుల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..


ప్రాణాంతక వ్యాధులకు చెక్..
చియాసీడ్స్‌ లో యాంటా ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయని కొన్ని నివేదికలు తెలిపాయి. దీంతో కార్డియోవాస్కూలర్, డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.


గుండె ఆరోగ్యం..
చీయా సీడ్స్‌లో ఉండే ఓమేగా 3 వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ నివేదికలో చీయాసీడ్స్ బీపీ స్థాయిలను కూడా తగ్గిస్తాయిని తెలిపింది. 


మొక్కల ఆధారిత ప్రొటీన్..
చీయా సీడ్స్‌ గింజలు చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇవి మంచి ప్లాంట్‌ ప్రొటీన్. ఒక టేబూల్ స్పూన్‌లో 5 గ్రాములు ఉంటుంది. ఇది వెజిటేరియన్లకు ప్రొటీన్‌ లేమి సమస్యకు చెక్‌ పెడుతుంది. కండరాల ఆరోగ్యంతోపాటు గాయాలు మానడానికి ప్రోటీన్ అవసరం.


ఇదీ చదవండి: ఇడ్లీ దోశలకు ఈ చట్నీ తయారు చేసుకోండి.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.. 


కావాల్సిన పోషకాలు..
చీయా సీడ్స్లో ప్రోటీన్, ఫైబర్‌ తోపాటు మైక్రో న్యూట్రియేంట్లు కూడా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌, సెలినియం, ఫోలేట్‌, విటమిన్‌ ఏ, బీ ఉంటాయి. ఇవి మెటాబాలిజం, ఎముక ఆరోగ్యానికి అవశ్యకం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook