Vitamin D foods: శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్ డి అత్యవసరం. వెంట్రుకలు, చర్మం, కండరాలు, ఎముకలు.. అన్నీ సమర్ధంగా, ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ డి సరిపడా అందాలి. కానీ ఈ విటమిన్ లోపం సర్వసాధారణమైపోయింది. ఎండ తగలకపోవడం, డి విటమిన్ లభించే ఆహారం సరిపడా తీసుకోకపోవడం.. ఇలా విటమిన్ డి లోపానికి బోలెడన్ని కారణాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమైపోవడం మూలంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. అయితే విటమిన్ డి ( Vitamin D ) సరిపడా అందడం కోసం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కనీసం 50% చర్మానికి ఎండ తగిలినప్పుడే శరీరంలో విటమిన్ డి సరిపడా ఉత్పత్తి అవుతుంది. అయితే ధరించే దుస్తులు, హెల్మెట్ల కారణంగా సూర్యరశ్మి సరిపడా శరీరానికి సోకే వీలు లేకుండా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వెంట్రుకలు ఊడిపోవడం, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్లనొప్పులు లాంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని తెలిపేవే.


Also read : How to check infections: ఇన్‌ఫెక్షన్స్‌ని ఇలా దూరం పెట్టండి


Vitamin D లోపం తలెత్తకుండా ఉండాలంటే..


మాంసాహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కనుక చేపలు, గుడ్లు, మాంసం.. తరచుగా ఆహారంలో ఓ భాగంగా చేసుకోవాలి.


శాకాహారులు తరచుగా మష్రూమ్స్ తీసుకుంటూ ఉండాలి.


విటమిన్ డి కలిసిన పదార్ధాలు (కార్న్‌ఫ్లేక్స్, వంటనూనెలు) ఎంచుకోవాలి.


విటమిన్ డి డైలీ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అయితే వీలైనంత వరకు సహజ పద్ధతిలోనే మనం తీసుకునే ఆహారం ( Foods for vitamin D ) ద్వారా శరీరానికి అసరమైన విటమిన్స్‌ని పొందేందుకు ప్రయత్నించడం ఆరోగ్యానికి మరింత మంచిది.


Also read : Health tips for glowing skin: అందమైన మెరిసే చర్మం కోసం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook