How to check infections: ఇన్‌ఫెక్షన్స్‌ని ఇలా దూరం పెట్టండి

కరోనావైరస్ తేలిగ్గా దాడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్‌ఫెక్షన్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే చలికాలం కరోనాతో పాటు ఇతరత్రా సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

  • Dec 04, 2020, 00:10 AM IST

ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తగ్గుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం, వాటి పనితీరు క్రమేపీ తగ్గిపోతుంది. అందులోనూ కరోనావైరస్ తేలిగ్గా దాడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్‌ఫెక్షన్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే చలికాలం కరోనాతో పాటు ఇతరత్రా సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

1 /8

అగర్ బత్తీలు, ఇతర పొగల వల్ల ఊపిరితిత్తులు త్వరగా పాడవుతాయి. పొగ ఎటువంటిదైనా అది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. 

2 /8

ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వెంటనే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

3 /8

సాధారణ జలుబును సైతం నిర్లక్ష్యం చేయకూడదు.

4 /8

ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసీ గదులకు, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది.

5 /8

డీప్ బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది.

6 /8

గోరువెచ్చటి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది.

7 /8

కాలుష్యం కలగలసిన పొగమంచు ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది. అందుకే స్మోగ్ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ పొగమంచుకు, కాలుష్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

8 /8

ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సొకకుండా స్కార్ఫ్ చుట్టుకోవాలి.