పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ... ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు (Nutrition food) లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్‌ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్ (Coronavirus) ఎటాక్ చేస్తోన్న సమయం కనుక ఏయే పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని (Immunity power) పెంచి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడే శక్తి పండ్ల సొంతం. అంతేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటివాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
అంగూరలు (Grapes fruits) : నిత్యం కాసేపు వ్యాయమం చేసిన తర్వాత గుప్పెడు అంగూరలు తింటే అలసిపోయిన శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. అలసటలో ఉన్నప్పుడు కూడా గ్రేప్స్ తీసుకున్నట్టయితే.. శరీరం వెంటనే ఉత్తేజితమయ్యే అవకాశాలు అధికం. విటమిన్ A, విటమిన్ C, B6 విటమిన్ లాంటి విటమిన్లకు అంగూరలు పవర్ హౌజ్ లాంటివి.
దానిమ్మ (Pomegranates): దానిమ్మ గింజల్లో అనేక పోషకాలు దాగుంటాయి. అవి శరీరంలో వ్యాధి నిరోధకతను వృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి.
అరటి (Banana fruits): అరటి పండులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు అరటి పండ్లు బాగా ఉపయోగడతాయి.
యాపిల్స్ (Apples) : యాపిల్స్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రోజుకో యాపిల్ తింటే డాక్టర్లను సంప్రదించే అవసరం కూడా ఉండదని స్వయంగా ఆరోగ్య నిపుణులే చెబుతుంటారు.
Read also : Coronavirus in India: కరోనావైరస్ భారత్‌లో అంతగా వ్యాపించకపోవడానికి కారణాలు ఇవేనా ?
అల్లనేరేడు (Black plums fruits) : అళ్లనేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువ స్థాయిలో ఉండి ఐరన్, పొటాషియం, విటమిన్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి సాధారణమైన చిన్నచిన్న జబ్బులను ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడతాయి.
బేరిపండ్లు (Pears fruits) : సీజనల్‌గా వచ్చే చిన్న చిన్న వ్యాధులకు ఇందులో ఉండే విటమిన్లు చెక్ పెడతాయి.
లీచీ (Litchi fruits): లీచి పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, రోగం తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్, వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. అంతేకాదండోయ్.. శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్స్‌ను సరఫరా చేసి అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
పీచ్ (Peach fruits) : పీచు పదార్ధం అధికం, క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండ్లు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ పండ్లలోనూ అధికంగా ఉండే సి విటమిన్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
ప్లమ్ ఫ్రూట్స్ (Plum fruits): శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి ఫ్లూ, కోల్డ్ వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
చెర్రీ పండ్లు (Cherry fruits) : చెర్రీ పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడికి గురైన మెదడుకు ప్రశాంతతను, విశ్రాంతిని అందిస్తాయి.
బొప్పాయి (Papaya fruits) : బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే అధిక పీచు పదార్ధం, బొప్పాయి రసం అనేక జబ్బులను ఎదుర్కోవడానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది.
శరీరంలో ఉండే ఇబ్బందులు, రుగ్మతల ఆధారంగా ఎప్పుడు ఏ పండు తీసుకుంటే మంచిదో ఆ పండు తింటే.. ఆయా రుగ్మతలు త్వరగా తగ్గే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అయితే, రుగ్మతలు దరిచేరక ముందే జాగ్రత్త పడటం మంచిది కనుక.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఎవరైనా... విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకుంటే మరీ మంచిది.