Walking Health Benefits: రోజూ 10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదా ?
Health Benefits Of Walking: వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా ? రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిది ? ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Health Benefits Of Walking: అనేక రకాల ఆరోగ్య సమస్యలకు శారీరక వ్యాయమంతో చెక్ పెట్టొచ్చు అనేది అందరూ చెప్పే మాట. ఎన్నో సందర్భాల్లో ఆ మాట అక్షర సత్యం అంటూ పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి. రోజుకు 10 వేల అడుగులు నడిస్తే.. అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు అనేది చాలామంది నమ్మే సిద్ధాంతం. ఇంకొంతమంది ఏం చెబుతుంటారంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతీ రోజు కనీసం 10 వేల అడుగులు నడవాల్సిందే అని సలహా ఇస్తుంటారు. అసలు ఇదంతా నిజమేనా ? కేవలం వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటే నమ్మొచ్చా ? అనే సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి.
ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
రోజూ 10 వేల అడుగులు నడవాల్సిందేనా ?
రోజుకు 10,000 అడుగులు నడిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ.. వాస్తవానికి మొదటిసారిగా ఈ మాట చెప్పిన వాళ్ల ఉద్దేశం తెలిస్తేనే కొంత సందేహం కలగక మానదు. 1965లో ఒక జపాన్ కంపెనీ వారు తమ స్టెప్ మీటర్ విక్రయాలు పెంచుకోవడం కోసం చేసిన ప్రకటనలోంచి ఈ ప్రచారం పుట్టుకొచ్చింది అని చెబుతుంటారు. అంటే ఇది హెల్త్ మేటర్ కంటే మార్కెటింగ్ కోణమే ఎక్కువగా కనిపిస్తోంది అనే వాదన కూడా ఉంది.
అయితే, ఈ వాదన సంగతి ఎలా ఉన్నప్పటికీ.. శారీరక శ్రమ అనేది ఎవరికైనా మేలు చేసే అంశమే అని డా రాజీవ్ గుప్తా అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎవరైనా సరే నిత్యం తమ దైనందిన జీవితంలో 5 వేల నుంచి 7,500 అడుగులు నడుస్తారు. ఇంకొంత శ్రమ అనుకోకుండా వాకింగ్ కోసం మరో 30 నిమిషాలు కేటాయిస్తే.. 3 వేల నుంచి 4 వేల అడుగులు అదనంగా నడుస్తారు. అన్నీ కలిపి మొత్తం 10 వేల అడుగులకు చేరువలో ఉంటాం. అసలు నడవకుండా ఒకే చోట ఉండటం కంటే.. ఎంతో కొంత నడవడం అనేది ఆరోగ్యానికి మేలు అంటారు డా రాజీవ్ గుప్తా. రోజుకు 10 వేల అడుగులు కచ్చితంగా పూర్తి చేయాలని ఏమీ లేదని.. కనీసం 7000 అడుగులు నడిచినా పర్వాలేదని డా గుప్తా చెప్పుకొచ్చారు.
వాకింగ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు.
ఊబకాయం వ్యాధి నుంచి బయటపడొచ్చు.
బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు.
అధిక రక్త పోటును నివారించవచ్చు.
డిప్రెషన్‌ని సైతం దూరం పెట్టొచ్చు.
ఇది కూడా చదవండి : Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?
ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్
ఇది కూడా చదవండి : Pineapple Benefits: పడక సుఖం పెంచే పైనాపిల్ పండు తింటే కేకో కేక
ఇది కూడా చదవండి : Health Tips For Drinkers: మద్యం తాగేవారికి కూడా హెల్త్ టిప్స్ ఉంటాయా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook