Watermelon Seeds Benefits: సాధారణంగా ఎండకాలం వచ్చిదంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు విపరీతంగా కనిపిస్తాయి. వీటితో త్వరగా దాహం తీరుతుంది. ముఖ్యంగా పుచ్చకాయలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. దీంతో ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. పుచ్చకాయలు మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల వడదెబ్బ కూడా కొట్టదు. అయితే, ఎప్పడూ పుచ్చకాయలను మాత్రమే తిని అందులో ఉండే గింజలను పారేస్తాం. కానీ, పుచ్చగింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మీ డైట్లో చేర్చుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్ పుచ్చ గింజల్లో ఉంటాయి. రాత్రి నానబెట్టిన పుచ్చగింజలను ఉదయం ఒక రెండు స్పూన్ లను టిఫిన్ తో పాటు తీసుకోవడం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.


ఇదీ చదవండి: మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..  


డయాబెటిస్ తో బాధపడేవారు ఇలా పుచ్చగింజలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారు ఇలా రోజు రెండు స్పూన్స్ నానబెట్టినవి తీసుకుంటే వారికి ఎంతో శ్రేయస్కరంపుచ్చ గింజల్లో విటమిన్ డి, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పుచ్చగింజలతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ..ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను వెడల్పు చేసి రక్త సరఫరాను మెరుగుపరచడానికి సహాయపడతాయి
అంతేకాదు పుచ్చకాయం గింజలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పుచ్చ గింజలను ఎండపెట్టి పొడి చేసుకొని రోజు ఉదయం పూట మరగకాచి తాగాలి. దీంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మీరు స్వయంగా అనుభవిస్తారు. పుచ్చగింజల నీటిని రెండు రోజుల గ్యాప్ తీసుకుని మళ్లీ ఈ వాటర్ తయారు చేసుకోవాలి.


ఇదీ చదవండి: ఖర్జూరం మగవారికి ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం.. నెయ్యిలో నానబెట్టి ఇలా తింటే..?  


అంతేకాదు పుచ్చగింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. పుచ్చగింజల్లో మోనో శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ముఖ్యంగా ఇవి రక్తంలో ఉండే కొవ్వులను కట్ చేస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు మన దరిచేరవు. పుచ్చగింజలు ఆరోగ్యపరంగా మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ జుట్టును బలపరిచి, పాడవ్వకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook