Dates Benefits: ఖర్జూరం మగవారికి ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం.. నెయ్యిలో నానబెట్టి ఇలా తింటే..?

Dates Health Benefits: రోజూ ఒక ఖర్జూరం మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.  డయాబెటిస్ తో బాధపడే వరకు ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 23, 2024, 04:19 PM IST
Dates Benefits: ఖర్జూరం మగవారికి ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం.. నెయ్యిలో నానబెట్టి ఇలా తింటే..?

Dates Health Benefits: రోజూ ఒక ఖర్జూరం మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.  డయాబెటిస్ తో బాధపడే వరకు ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లకి ఖర్జూరం ఒక వరం లాంటిది. ఖర్జూరంలో జిఐ ఇండక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇది షుగర్ వ్యాధులకు ఎంతో ఉపయోగకరం ప్రతిరోజు ఖర్జూరం తో తయారు చేసిన బిస్కెట్స్ తినడం ఎంత ఆరోగ్యకరం. ఇందులో ఎక్కువ శాతం పొటాషియం, ఫైబర్, ఐరన్ ఉంటుంది. డైలీ ఒక ఖర్జూరం తినడం వల్ల హాట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఇది తరచూ జ్వరం బారిన పడకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచుతుంది.

సాధారణంగా మన అందరి ఇళ్లలో అధిక శాతం వైట్ షుగర్ కి బెస్ట్ ప్రత్యామ్నాయం ఖర్జూరం. చక్కెరలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి దీనికి మంచి ప్రత్యామ్నాయం పనిచేస్తుంది ఖర్జూరం. ప్రతిరోజు ఒక ఖర్జూరం తినడం వల్ల ఆ రోజుకు సరిపోయే పోషకాలని అందుతాయి.ఒక అధ్యయనం ప్రకారం డయాబెటిస్ తో బాధపడేవారు రోజు ఒక ఖర్జూరం తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉన్నాయి. పిల్లలకు కూడా ప్రతిరోజు ఒక ఖర్జూరం ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది ఎక్కువసేపు ఉత్సాహంగా ఉంటారు.ఫైబర్ పవర్ హౌజ్ ఖర్జూరం.. సాధారణంగా ఫైబర్ ఉండే ఆహారాలు మన డైట్లో చేర్చుకుంటే మలబద్ధకం సమస్య కూడా రాదు. పేగు ఆరోగ్యం బాగుటుంది. పెద్దల్లోనే కాదు కొంతమంది పిల్లల్లో కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. వారికి ప్రతిరోజూ ఓ ఖర్జూరం ఇవ్వాలి. అంతేకాదు ఇలా ఖర్జూరం పిల్లలకు తినిపించడం వల్ల వారికి ఎక్కువ చక్కెర పదార్థాలు తినాలనిపించదు.

ఇదీ చదవండి:  పుచ్చకాయను సగం కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..

ఇక మగవారికి ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అటువంటి వారికి ఖర్జూరం వరం వంటిది. ఎండిన ఖర్జూరాలను మార్కెట్ నుంచి తీసుకువచ్చి వాటి లోపలి గింజను తీసేయాలి. ఇప్పుడు నాలుగ భాగాలుగా కట్ చేసిన ఖర్జూరాలను ఆవునెయ్యిలో నానబెట్టాలి. దీన్ని కదపకుండా 21 రోజులపాటు అలాగే నాననివ్వాలి. ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం పరగడుపున కాస్త నెయ్యితోపాటు ఖర్జూరం ముక్కను కూడా తినాలి. ఇలా చేయడం వల్ల మీ నరాలు ఉత్తేజితమవుతాయి. లైంగిక సామర్థ్యం కూడా తిరిగి బలపడుతుంది. అందుకే మరీ ముఖ్యంగా మగవారు తమ ఆహారంలో ఈ విధంగా ఖర్జూరం చేర్చుకోవాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ఇదీ చదవండి: తేనె తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? తప్పుకుండా మీరు తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News