Honey Water: ప్రకృతిలో పుష్కలంగా లభించే తేనె..ఆరోగ్యానికి ఓ అమృతం లాంటిది. తేనె నీళ్లతో కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంపూర్ణ ఆరోగ్యం కోసం తేనె సేవించడం చాలా మంచిది. తేనె గురించి ప్రతి వైద్యశాస్త్రంలోనూ ప్రస్తావన ఉంది. ప్రతి వైద్యుడూ తేనె సేవించమనే సిఫారసు చేస్తుంటారు. తేనె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా తేనె సేవించడం ద్వారా దూరం చేయవచ్చు. అందుకే తేనెను ఔషధ గుణాలకు పెట్టింది పేరుగా చెబుతారు. ప్రతిరోజూ ఉదయం వేళ పరగడుపున తేనె సేవించడం ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా..తేనెను నీళ్లతో కలిపి తాగడం వల్ల చాలా రకాల రోగాలు దూరమౌతాయి.


ప్రతిరోజూ తేనె నీరు తాగడం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఉదయం ఓ గ్లాసు నీటిలో తేనె కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగౌతుంది. మెటబోలిజం వృద్ధి చెందుతుంది. ఇదొక డీటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. బాడీలోని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 


తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా జలుబు-దగ్గు, వైరల్ వ్యాధులు, సీజనల్ ఎలర్జీ, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది.


గొంతులో తరచూ కలిగే ఇబ్బందిని దూరం చేసేందుకు తేనెను మించిన ఔషధం లేదనే చెప్పాలి. గొంతు నొప్పి, గొంతు వాపు సమస్యల్ని దూరం చేస్తుంది. దీనికోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని నెమ్మది నెమ్మదిగా తాగాలి.


Also read: Diabetes: మధుమేహం నియంత్రణకు 5 అద్భుత ఆయుర్వేద ఔషధాలివే, ప్రతి వంటగదిలో ఉండేవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook