Diabetes: మధుమేహం నియంత్రణకు 5 అద్భుత ఆయుర్వేద ఔషధాలివే, ప్రతి వంటగదిలో ఉండేవే

Diabetes: ఆధునిక బిజీ ప్రపంచంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారి సవాలు విసురుతోంది. ఆయుర్వేదంలో కొన్ని రకాల వేర్లతో మధుమేహాన్ని సహజ సిద్ధంగానే తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 07:10 PM IST
Diabetes: మధుమేహం నియంత్రణకు 5 అద్భుత ఆయుర్వేద ఔషధాలివే, ప్రతి వంటగదిలో ఉండేవే

Diabetes: ఆధునిక బిజీ ప్రపంచంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారి సవాలు విసురుతోంది. ఆయుర్వేదంలో కొన్ని రకాల వేర్లతో మధుమేహాన్ని సహజ సిద్ధంగానే తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రకృతిలో చాలా రకాల వ్యాధులకు పరిష్కారముంది.  ప్రకృతి అంతా ఔషధాలతో నిండి ఉంది. ప్రస్తుతం సవాలుగా మారిన మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా ఆయుర్వేదంలో అద్భుత వైద్య విధానముంది. కొన్ని రకాల వేర్లతో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

మధుమేహాన్ని మెడికేషన్, జీవనశైలిలో మార్పుల ద్వారా నియంత్రించవచ్చు. ముఖ్యంగా సరై ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యం. అదే సమయంలో ఆయుర్వేదం కీలక భూమిక పోషించనుంది. మన వంటింట్లో లభించే పలు రకాల వేర్లు, మూలికలతోనే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. వాటిని సరైన సమయంలో సరైన రీతిలో ఉపయోగిస్తే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆ వివరాలు మనమూ తెలుసుకుందాం..

మధుమేహాన్ని నియంత్రించే ఐదు ఆయుర్వేద ఔషధాలు

1. మెంతులు మధుమేహం నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తాయి. స్థూలకాయం, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా మెంతులు దోహదపడతాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గించి..గ్లూకోజ్ జీర్ణాన్ని పెంచుతుంది. టోటల్ కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్, ట్రై గ్లిసరాయిడ్స్‌ను తగ్గిస్తుంది. 

2. దాల్చినచెక్క ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తూ..భోజనం తరువాత కూడా బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు సైతం ఉపయోగపడుతుంది. 

3. అల్లంతో ఆరోగ్యపరంగా అద్భుతాలు చేయవచ్చు. అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపో లిపిడెమిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరం మెటబోలిజంను పెంచేందుకు అల్లం దోహదపడుతుంది. HbA1C సహా ఫాస్టింగ్ షుగర్ తగ్గిస్తుంది. 

4. నల్ల మిరియాలు మన వంటింట్లో లభించే మరో అద్భుత ఔషధం. ఇన్సులిన్ సెన్సిటివిటీని వృద్ధి చేయడం, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించేలా శరీరం సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇందులో కీలకమైన పైపెర్‌మైన్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది.

5. జిన్సెంగ్ అనేది అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ గుణాలు కలిగిన మూలికే కాకుండా అద్భుతమైన యాంటీ డయాబెటిక్. శరీరంలో కార్బొహైడ్రేట్స్ సంగ్రహణాన్ని తగ్గిస్తుంది. పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణ  స్థాయిలో ఉంటాయి.

Also read: Food For Good Cholesterol: వీటిని ఆహారంగా తీసుకుంటే చాలు.. మీ దరిదాపుల్లోకి ఎలాంటి వ్యాధులు రావు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News