Cholesterol Control: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినా..రక్తపోటు అధికమైనా అన్నింటికీ ఇదే కారణం. అందుకే రోజూ ఈ డ్రింక్స్ సేవిస్తే..అన్ని సమస్యల్నించి పరిష్కారం లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. ముఖ్యంగా కొలెస్ట్రాల్, రక్తపోటు, చెడు కొవ్వు, హార్ట్ ఎటాక్ సమస్యలు తలెత్తుతుంటాయి. తినే తిండి సరిగ్గా లేకపోయినా లేదా ఒకేసారి ఎక్కువ మోతాదులో తిన్నా..పూర్తిగా జీర్ణం కాక...చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా అలసట, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి సమస్యలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమైందంటే..సమయానికి నియంత్రించలేకపోతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు ఎదురౌతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు సహజసిద్దమైన కొన్ని హోమ్ డ్రింక్స్ తప్పని సరి. అవేంటో తెలుసుకుందాం..


స్థూలకాయం కారణంగా వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే మంచి డైట్‌తోపాటు రోజూ ఆనపకాయ జ్యూస్ తప్పకుండా తాగాలి. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉండటమే కాకుండా..98 శాతం నీరు ఉండటం వల్ల..అనవసరమైన వ్యర్ధ కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 


ఇక రెండవది కాకరకాయ జ్యూస్. చాలామంది చేదుగా ఉంటుందనే కారణంతో ఇష్టపడరు. కానీ కాకరకాయలో విటమిన్లు, మెగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఒకేసారి ఎక్కువ తినడం వల్ల మీ శరీరం జీర్ణం చేసుకోలేదు. ఫలితంగా జీర్ణం కాకుండా మిగిలింది కొలెస్ట్రాల్‌గా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ కరిగించేందుకు రోజూ కాకరకాయ జ్యూస్ మంచి ఔషధం.


ఇక మూడవది టొమాటో జ్యూస్. సాధారణంగా ఎక్కువమంది టొమాటోను సలాడ్ రూపంలో తీసుకుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం టొమాటో జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు టొమాటో జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్..శరీరంలో ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న నియాసిన్, విటమిన్ బి3లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనివ్వవు. 


Also read: Sweet laddus: తీపి లడ్డూలతో స్థూలకాయానికి చెక్, డయాబెటిస్ రోగులు కూడా తినవచ్చు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook