Sweet laddus: స్వీట్స్ తింటే రెండు రకాల అనర్ధాలున్నాయంటారు. బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ప్రమాదకరం. కానీ ఆ లడ్డూలు డయాబెటిక్ రోగులు కూడా తినొచ్చు, బరువు కూడా తగ్గుతారు..
మెంతుల గురించి అందరికీ తెలిసిందే. వివిధ ఆయుర్వేద ఔషదాల తయారీలో కీలకమైంది. మెంతులనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రస్తుత రోజుల్లో స్థూలకాయం, డయాబెటిస్ ప్రధాన సమస్యలుగా మారాయి. తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి. ఆహారపు అలవాట్లు బాగుంటే స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలుండవు. బరువు తగ్గేందుకు సాధారణంగా స్వీట్స్ తినకూడదంటారు. కానీ మెంతులతో చేసిన లడ్డూలు మాత్రం అద్భుత ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. బరువు తగ్గించడమే కాకుండా..డయాబెటిస్ రోగులు కూడా తినవచ్చు.
మీరు కూడా బరువు తగ్గించుకోవాలనుకుంటే..మెంతి లడ్డూలు తప్పకుండా తినాల్సిందే. మెంతుల్లా చేదుగా ఉండకపోవడంతో ఏ ఇబ్బంది లేకుండా తినగలుగుతారు. బరువు తగ్గేందుకు చాలామంది మెంతుల్ని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటుంటారు. అయినా కొద్దిగా చేదుగా ఉంటాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఒక మెంతి లడ్డూ తింటే చాలంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. కొద్దిరోజుల్లోనే సులభంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు.
మెంతి లడ్డూ తయారీకు కావల్సిన పదార్ధాలు
మెంతి గింజలు, బెల్లం, పంచదార, గోధుమ పిండి, పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాలి. రుచి కోసం సొంఠి, ఇలాచి, దాల్చిన చెక్క, జాయఫలం కూడా వాడవచ్చు.
మెంతి లడ్డూ తయారీ విధానం
ముందుగా మెంతి గింజల్ని నానబెట్టి ఆరబెట్టాలి. ఆ తరువాత కాస్త గరగరగా మిక్సీ చేయాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్, జాయఫలం, ఇలాచీ కలపాలి. ఓ కడాయిలో నెయ్యి వేడి చేసి..అందులో మిక్స్ చేసిన వస్తువులు వేయాలి. తరువాత బెల్లం లేదా పంచదార కలపాలి. ఆ తరువాత గోరువెచ్చని పాలు మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టౌ కట్టేసి..లడ్డూలు తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ లడ్డూలు తింటే మంచి ఫలితాలుంటాయి.
Also read: Healthy Liver Tips: లివర్ సమస్యకు మద్యపానం కారణం కాదు..ఈ 8 అలవాట్లు మానేయండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook