Dry Fruits Effect: బలమైన, అత్యధిక పోషక విలువలుండే పదార్ధాలేవంటే డ్రై ఫ్రూట్స్ అని ఠక్కున చెప్పేస్తుంటాం. మెరుగైన ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి అంటారు. కానీ శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే ఎవరైనా సరే డ్రై ఫ్రూట్స్ అనే చెబుతారు. నిజంగానే డ్రై ఫ్రూట్స్‌తో తాలా ప్రయోజనాలున్నాయి. శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు, విటమిన్స్ మెండుగా ఉండటంతో వైద్యులు కూడా తప్పనిసరిగా తినమని సూచిస్తుంటారు. ప్రతిరోజూ ఆహారంతో అయినా లేదా విడిగా అయినా కొంత పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. అయితే పరిమితి దాటకూడదు. పరిధి దాటితే ఏదైనా హాని కల్గిస్తుంది. అయితే శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్‌తో చాలా దుష్పరిణామాలుంటాయనేది చాలా తక్కువమందికే తెలుసు. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం.


ప్రకృతిలో మనకు లభించే డ్రై ఫ్రూట్స్‌లో(Dry Fruits)చాలా గుణాలుంటాయి. అందుకే శీతాకాలంలో ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా పరిమితికి మించి తింటే నష్టాలెక్కువేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనంటున్నారు. డ్రై ఫ్రూట్స్ అనేవి సాధారణంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. కానీ శీతాకాలంలో ఎక్కువగా తింటే ఇవే డ్రై ఫ్రూట్స్ బరువు పెంచుతాయి. ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ఇక మరో ముఖ్యమైన సమస్య అజీర్తి. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ (Dry Fruits in Winter)ఎక్కువగా తీసుకుంటే అజీర్తి, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 


ఇక డయాబెటిస్ సమస్య ఉన్నవాళ్లు పరిమితంగానే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా చక్కెర స్థాయి పెరుగుతుంది.డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఉదర సమస్యలు పెరుగుతాయి. డయేరియా వంటి తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే.ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. డయేరియా వంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయి. డ్రై ఫ్రూట్స్ ద్వారా శరీరంలో చేరే చక్కెర దంతనొప్పికి కారణమవుతుంది. దంతాల్లో పిప్పిపళ్లు ఏర్పడవచ్చు. ఇక మరో ముఖ్యమైనది డీ హైడ్రేషన్. డ్రై ఫ్రూట్స్ శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటే  డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని(Dry Fruits Effects) పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. 


Also read: Omicron Variant: ఇండియాలో ఆందోళన రేపుతున్న ఒమిక్రాన్ తీవ్రత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook