ప్రస్తుతం ప్రపంచమంతా సవాలుగా మారిన డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మధుమేహంతో బాధపడేవారు ప్రధానంగా ఏది తినవచ్చు..ఏది తినకూడదనేది తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైంది బంగాళదుంప. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం నియంత్రణకు ముఖ్యంగా పాటించాల్సిన ప్రధాన సూత్రం ఆహారపు అలవాట్లు. కొన్ని రకాల పదార్ధాలు తీసుకోవాలి. మరికొన్ని పదార్ధాలకు దూరం పాటించాలి. ఈ క్రమంలో దైనందిక ఆహారంలో భాగంగా మారిన బంగాళదుంప..డయాబెటిస్ రోగులు తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం లేదా అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు బంగాళదుంప తినవచ్చా లేదా..వైద్యులు ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం.


మధుమేహం అనేది ఒకసారి సోకితే..నియంత్రణ ఒక్కటే సాధ్యం. దీనికి పూర్తి చికిత్స లేదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు తన ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పొటాటో విషయంలో చాలా సందేహాలుంటున్నాయి. ఎందుకంటే పొటాటోలో కార్పోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున..డయాబెటిస్ రోగులు తినవచ్చా లేదా అనే సందిగ్దంలో ఉంటారు. పొటాటో కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయా..వైద్యులు ఏమంటున్నారు మరి..


డయాబెటిస్ రోగులకు పొటాటో ఎంతవరకు మంచిది


వైద్య నిపుణుల ప్రకారం బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అయినా మధుమేహ వ్యాధిగ్రస్థులకు పొటాటో తీనడం పూర్తిగా నష్టదాయకం కాదు. స్టార్చ్ లేని ఇతర కూరగాయలతో కలిపి తింటే పొటాటో నష్టం చేకూర్చదంటున్నారు వైద్యులు.


ఇతర పదార్ధాలతో కలిపి పొటాటో తీసుకోవచ్చు


ఉడకబెట్టిన లేదా ఫ్రై చేసిన బంగాళదుంపలు తినడం కంటే..వాటిని విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఇతర పదార్ధాలతో కలిపి తింటే చాలా మంచిది. ఇలా తినడం వల్ల పొటాటోలోని సైడ్ ఎఫెక్ట్స్ చాలావరకూ తగ్గిపోతాయి. డయాబెటిస్ రోగులకు ఏ విధమైన నష్టం కలగదు.


డయాబెటిస్ రోగులు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచేందుకు చాలా పోషక పదార్ధాలు అవసరమౌతాయి. బంగాళదుంప తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ పోషకాలు లభిస్తాయి. పొటాటోలో ఉన్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు డయాబెటిస్ రోగికి రోగంతో పోరాడేందుకు దోహదపడతాయి. అయితే పరిమిత మోతాదులో..ఇతర పదార్ధాలతో కలిపి తినాలి. 


Also read: Black Raisins: బ్లాక్ కిస్మిస్ ఇలా తీసుకుంటే..ఆ వ్యాధులు మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook