Black Raisins: బ్లాక్ కిస్మిస్ ఇలా తీసుకుంటే..ఆ వ్యాధులు మటుమాయం

Black Raisins: కిస్మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బ్లాక్ కిస్మిస్ మరింత ఆరోగ్యకరం. కిస్మిస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2022, 09:01 PM IST
Black Raisins: బ్లాక్ కిస్మిస్ ఇలా తీసుకుంటే..ఆ వ్యాధులు మటుమాయం

కిస్మిస్ ప్రతి ఇంటి కిచెన్‌లో ఉండేదే. స్వీట్స్, పాయసం, ఇతర వంటకాల్లో కచ్చితంగా ఉపయోగిస్తారు. కిస్మిస్ పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు.

మెరుగైన ఆరోగ్యం కోసం పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ ఇందులో ముఖ్యమైనవి. డ్రైఫ్రూట్స్‌లో బ్లాక్ కిస్మిస్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. బ్లాక్ కిస్మిస్‌ను రాత్రంతా నానబెట్టి...రోజూ ఉదయం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. కిస్మిస్‌ను డైట్‌లో భాగంగా చేసుకుంటే..శరీరంలో రక్తం పెరుగుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఇందులో ఉండే పోషక పదార్ధాలతో అనేక వ్యాధుల్నించి విముక్తి పొందవచ్చు.

బ్లాక్ కిస్మిస్ ప్రయోజనాలు

1. ప్రతి రోజూ ఉదయం 7-8 కిస్మిస్‌లు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతుంటే..ఇతర సమస్యలు చుట్టుముడతాయి. బ్లాక్ కిస్మిస్‌లో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు.

2. ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తోంది. బ్లాక్ కిస్మిస్ తినడం వల్ల శరీరంలో రక్తం వేగంగా ఏర్పడుతుంది. ఎముకలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారికి బ్లాక్ కిస్మిస్ చాలా మంచిది. బ్లాక్ కిస్మిస్‌తో ఎముకలకు బలం చేకూరుతుంది. 

3. చలికాలం ప్రారంభమైపోయింది. చలికాలం వస్తే చాలు శరీరంలోని రోగ నిరోధక శక్తి పడిపోతుంది. ఇమ్యూనిటీ క్షీణించడం వల్ల అంటురోగాలు లేదా ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. వివిధ రకాల వ్యాధుల ముప్పు ఎక్కువౌతుంది. బ్లాక్ కిస్మిస్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

Also read: Honey Quality Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, సులభమైన చిట్కాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News