Food Tips: డిప్రెషన్, ఆందోళన ఉన్నవాళ్లు..ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసా
Food Tips: కొన్ని రకాల ఆహార పదార్ధాలు అనారోగ్యానికి కారణమౌతుంటాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, డిప్రెషన్‌కు కారణం కూడా కొన్ని రకాల ఆహారాలే. ఆ వివరాలు మీ కోసం..
Food Tips: కొన్ని రకాల ఆహార పదార్ధాలు అనారోగ్యానికి కారణమౌతుంటాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, డిప్రెషన్‌కు కారణం కూడా కొన్ని రకాల ఆహారాలే. ఆ వివరాలు మీ కోసం..
మనం రోజూ తినే ఆహార పదార్ధాల ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే కాకుండా మన మెదడుపై కూడా పడుతుంది. బహుశా అందుకే మూడ్ మారేందుకు వివిధ రకాల ఆహార పదార్ధాలు తింటుంటారు. అందుకే ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు కొన్ని పదార్ధాలు తినకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల తాత్కాలికంగా సంతోషం కలగవచ్చేమో కానీ..ఆ తరువాత మిమ్మల్ని మరింత డిప్రెషన్‌కు గురి చేస్తుంది. డిప్రెషన్, ఆందోళన వెంటాడుతున్నప్పుుడు కొన్ని పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు.
ఏవి తినకూడదు
పేస్ట్రీ, బిస్కట్, బ్రెడ్ వంటి పదార్ధాలు డిప్రెషన్, ఆందోళన ఉన్నప్పుడు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉండే సోడియం కారణంగా డిప్రెషన్ పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో అజీర్ణ సమస్య తలెత్తుతుంది. అందుకే సోడియం ఎక్కువగా ఉండే పదార్ధాలను దూరంగా పెట్టాలి. చాలామంది నిద్రను దూరం చేసేందుకు టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఈ రెండింటిలోనూ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అనేది డిప్రెషన్‌ను పెంచుతుంది. కెఫీన్ కారణంగా మీలో మీకు తెలియకుండానే విసుగు అధికమై..డిప్రెషన్‌కు దారితీస్తుంది. అందుకే కెఫీన్ ఉండే పదార్ధాలు తినకూడదు.
ఇక మరో ముఖ్యమైన నిషేధిత పదార్ధం ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది శరీరానికే కాదు..మస్తిష్కానికి కూడా హాని కల్గిస్తుంది. డిప్రెషన్ సమస్యతో బాధపడేవాళ్లు ఆల్కహాల్ సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ కారణంగా నిద్ర లేమి ఉంటుంది. ఇది పరోక్షంగా డిప్రెషన్, ఆందోళనకు దారి తీస్తుంది.
Also read: Brown Rice Benefits: బ్రౌన్ రైస్‌కు, వైట్ రైస్‌కు తేడాలేంటి, బ్రౌన్ రైస్‌తో బరువు ఎలా తగ్గడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook