Monsoon Diseases: వర్షాకాలంలో వివిధ రకాల రోగాలు, వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఏ మాత్రం నలతగా ఉన్నా..కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించాలి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షాలతో పాటు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, రోగాల బెడద ఎక్కువౌతుంటుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు సమస్యలు తరచూ కన్పిస్తుంటాయి. చాలా వరకూ ఇలాంటి సమస్యలు సరైన ఆహారం తీసుకుంటే నయమైపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలం ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం ఎక్కువ రోజులుగా ఉంటే వెంటనే కొన్ని పరీక్షలు చేయించాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


మలేరియా


వర్షాకాలంలో తలెత్తే ప్రధానమైన, తీవ్రమైన వ్యాధి మలేరియా. దోమకాటు ద్వారా వ్యాపించే వ్యాధి ఇది. నిల్వ ఉండే నిళ్లలో మలేరియా కారక దోమ ఉంటుంది. జ్వరంతో పాటు చలి, వణుకు, చెమటలు పట్టడం, ఒంటి నొప్పులు ఉంటే వెంటనే మలేరియా పరీక్ష చేయించడం మంచిది. మలేరియా నిర్ధారణకు ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ చేస్తారు. 


టైఫాయిడ్


వర్షకాలంలో వచ్చే మరో వ్యాధి టైఫాయిడ్. ఈ వ్యాధి కలుషిత భోజనం, నీటి ద్వారా విస్తరిస్తుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరంగా చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదయం కాగానే తగ్గిపోతుంటుంది. జ్వరంతో పాటు కడుపు నొప్పి, తలనొప్పి సమస్యలుంటే వెంటనే టైపాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిది.


డెంగ్యూ


డెంగ్యూ అనేది వైరస్ సంక్రమణ వ్యాధి. మగ దోమ కాటుతో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన జ్వరంతో పాటు తలనొప్పి, స్కిన్ ర్యాషెస్, కంటి వెనుక నొప్పి, ఒంటి నొప్పులుంటే డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే డెంగ్యూని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమౌతుంది. 


Also read: Protein Deficiency: ప్రోటీన్ లోపంతో వచ్చే వ్యాధులేంటి, ప్రోటీన్ లోపం లక్షణాలెలా ఉంటాయి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook