High Blood Pressure: నిద్రపోయేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే..బ్లడ్ ప్రెషర్ పెరగడం ఖాయం
High Blood Pressure: అధిక రక్తపోటు ఓ ప్రధానమైన సమస్య. దీన్ని నియంత్రించడం చాలా కష్టం. మనం పడుకునే విధానం రక్తపోటును పెంచుతుంది. అందుకే రక్తపోటు నియంత్రించాలంటే..కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఇవి పాటిస్తే సులభంగా రక్తపోటును నియంత్రించవచ్చు.
రక్తపోటు పెరగడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణం కావచ్చు. హార్ట్ ఎటాక్, రక్తపోటు నుంచి విముక్తి పొందాలంటే చిన్న చిన్న విషయాలే అయినా ఫోకస్ పెట్టాలి. తద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు.
తిండి అలవాట్లు, జీవనశైలి, పడుకునే విధానం ఇవన్నీ రక్తపోటుపై దుష్ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా పడుకునేటప్పుడు రక్తపోటు వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యానికి నష్టం కల్గించేవిధంగా పడుకోకూడదు. ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలనేది తెలుసుకుందాం..
ఇటు తిరిగి పడుకోవడం
పడుకునేటప్పుడు ఓ వైపుకు తిరిగి పడుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ రోగులు ఎప్పుడూ ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల బ్లెడ్ వెసెల్స్ రిలాక్స్ అవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విధంగా బ్లడ్ సరఫరా నియంత్రితమౌతుంది.
కాళ్ల కింద దిండు
అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థులు తల కింద దిండు పెట్టుకోకుండా కాళ్ల కింద పెట్టుకుని పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల బ్లడ్ వెసెల్స్‌కు విశ్రాంతి లభిస్తుంది. కాళ్లలో దిండు పెట్టుకోవడం వల్ల చికాకు ఉండదు. అటు రక్తపోటు కూడా ఉండదు. కాళ్లలో దిండు పెట్టుకోవడం వల్ల నిద్ర కూడా బాగాపడుతుంది.
పొరపాటున కూడా
అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థులు పడుకునేటప్పుడు టైట్ సాక్స్ వేసుకుని పడుకోకూడదు. లేకపోతే రక్త సరఫరాపై దుష్ప్రభావం పడుతుంది. రక్తపోటు ముప్పు పెరగవచ్చు. అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థులు వదులైన సాక్స్ ధరించాలి.
తగినంత నిద్ర
ఆరోగ్యంగా ఉండేందుకు మంచి నిద్ర అనేది అవసరం. నిద్ర తక్కువైతే ఆరోగ్యంపై దుష్ప్పభావం పడుతుంది. అధిక రక్తపోటు రోగులకు నిద్ర ఎప్పుడూ పూర్తిగా ఉండాలి. నిద్ర తక్కువైతే రక్తపోటు పెరుగుతంది.
Also read: Digestive problems: భోజనం చేసేటప్పుడు చేయకూడని ప్రధాన తప్పులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook