Diabetes: డయాబెటిస్ అనేది దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్‌లో విరివిగా లభించే పదార్ధంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చెడు జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో పెద్దవాళ్లే కాకుండా..యువకులు కూడా డయాబెటిస్ బారినపడుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు నియంత్రణలో లేకపోతే ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మార్కెట్‌లో విరివిగా లభించే కీరాతో డయాబెటిస్ నియంత్రించవచ్చు..


కీరా సూప్‌తో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ముందుగా కీరాను ముక్కలుగా కోసి అందులో 3 చెంచాలు నిమ్మరసం, చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెమ్మ, పావు చెంచా ఆలివ్ ఆయిల్, అరకప్పు ధనియా, ఒక చెంచా జీలకర్ర, ఉప్పు, నల్ల మిరియాల పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. రుచిని బట్టి పెరుగు లేదా పాలు వేసుకోవాలి. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా..బరువు కూడా తగ్గుతారు.


కీరాను సలాడ్‌గా కూడా తీసుకోవచ్చు.రోజూ కీరా సలాడ్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


డయాబెటిస్ రోగులు కీరాతో రాయితా అంటే పెరుగు పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిది. దీనివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణతో పాటు అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.


Also read: Feet Sensation: మీ పాదాల కింద తరుచుగా ఇలా పదన వస్తుందా.. అయితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok