Kidney Health: కిడ్నీ అతి ముఖ్యమైన అవయవం. ఇది సరిగ్గా లేకపోతే ప్రాణాంతకమౌతుంది కూడా. అంతటి ముఖ్యమైన అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడు డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కిడ్నీ అనేది ఒక ఫిల్టర్ లాంటిది. చాలా ముఖ్యమైన పనిచేస్తుంటుంది. శరీరం నుంచి విష పదార్ధాల్ని తొలగించేది ఇదే. ఆ విష పదార్ధాలే ఒక్కోసారి కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంటాయి. అందుకే రోజూ ఒక డ్రింక్ తీసుకోవడం ద్వారా కిడ్నీని శుభ్రపర్చుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. కిడ్నీల్ని శుభ్రపర్చే డ్రింక్ ఎప్పుడు ఎలా తాగాలో చూద్దాం..


శరీరంలో ఉండే వ్యర్ధ, చెడు పదార్ధాల్ని యూరిన్ ద్వారా బయటకు పంపించడమే కిడ్నీ చేసే ప్రధాన పని. ఇది కాకుండా శరీరంలో సాల్ట్, పొటాషియంతో పాటు యాసిడ్ లెవెల్స్ కూడా నియంత్రిస్తుంది. దాంతోపాటు శరీరపు వివిధ భాగాల పనితీరును ప్రభావితం చేసే హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. 


హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 2 నిమ్మకాయల రసం తాగడం వల్ల యూిన్ సిట్రేట్ పెరిగి..కిడ్నీ నుంచి టాక్సిన్స్ బయటకు తొలగిపోతాయి. అటు రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల యూరిన్ పోసేవారికి..కిడ్నీలో రాళ్ల సమస్య చాలావరకూ తగ్గుతుంది. కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ ఉదయం, మద్యాహ్నం ఈ డ్రింక్స్ తాగాలి. 


కిడ్నీల్ని శుభ్రం చేసే లెమన్ డ్రింక్స్


పుదీనా లెమన్ డ్రింక్..ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, పుదీనా ఆకులు, కొద్దిగా పంచదార వేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఇది రోజూ ఉదయం లేదా మద్యాహ్నం పూట తీసుకుంటే ఆరోగ్యానికి, కిడ్నీలకు చాలా మంచిది. ఇక రెండవది మసాలా లెమన్ సోడా. ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, జీలకర్ర, ధనియా పౌడర్‌తో పాటు కొద్దిగా చాట్ మసాలా , సోడా వేసి కలపాలి. ఈ డ్రింక్ రోజూ ఉదయం లేదా మద్యాహ్నం తీసుకోవాలి. ఇక మూడవది కోకోనట్ శికంజి.  ఈ డ్రింక్ తయారీ కూడా సులభమే. ఒక గ్లాసు నీళ్లలో కొబ్బరినీళ్లు పోసి..అందులో నిమ్మరసం కలుపుకుని తాగాలి. 


Also read: Omega 3 Fatty Acids: గుండెపోటు నుంచి రక్షించే అద్భుత ఔషధం, ఏ ఆహార పదార్ధాల్లో లభిస్తుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి