Heart Attack Risk Factors: దేశంలో గుండె వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధుని జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె పోటు ముప్పు ఎక్కువౌతోంది. ఈ ముప్పు నుంచి దూరంగా ఉండాలంటే ఆ మాడు అలవాట్లు వదిలేయాలంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో లైఫ్‌స్టైల్ బిజీగా ఉంటోంది. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి. ఫలితంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హార్ట్ ఎటాక్ ఒకటి. వయస్సు పెరగడంతో పాటుగా వచ్చే ఈ గుండెపోటు వ్యాధి..గత కొన్నేళ్లుగా తక్కువ వయస్సుకే ఎటాక్ చేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. ఇందులో చాలామంది సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అసలు గుండెపోటు అంటే ఏంటి, ఎలా సంభవిస్తుంది, గుండెపోటు సమస్యకు దూరమయ్యేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..


గుండెపోటు అంటే ఏమిటి


గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంటుంది. ఇది సహజంగా రక్త నాళికల్లో పేరుకున్న కొవ్వు, ఇతరత్రా వాటివల్ల జరుగుతుంది. మనం ప్రతిరోజూ తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా గుండపోటు ముప్పు పెరుగుతుంటుంది. ఆ పొరపాట్లు ఏంటనేది తెలుసుకోవల్సిన అవసరముంది. ముఖ్యంగా అలవాట్లు మార్చుకుంటే గుండెపోటు ముప్పును తగ్గించవచ్చు.


బరువు తగ్గించడం


బిజీ ప్రపంచంలో అధిక బరువు సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అధిక బరువు అనేది హార్ట్ ఎటాక్‌కు ముఖ్యమైన కారణం. స్థూలకాయం కారణంగా కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ ముప్పుు అధికమౌతుంది. ఇవన్నీ గుండెపోటు ముప్పును పెంచుతాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా బరువు తగ్గించుకోవాలి.


స్మోకింగ్, ఒత్తిడి


స్మోకింగ్ అలవాటున్నవారికి, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేవారికి గుండెపోటు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. స్మోకింగ్ వల్ల ధమనుల్లో క్రమంగా ప్లఫ్ పేరుకుంటుంది. ఫలితంగా ధమనులు సంకోచించి..గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దాంతో గుండెపోటు సమస్యలు ఎదురౌతాయి. అదే విధంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేవాళ్లకు రక్తపోటు పెరిగిపోతుంది. బీపీ పెరగడమంటే గుండెపోటు సమస్య ఎక్కువగా ఉన్నట్టే. 


ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం


కదలకుండా ప్రశాంతంగా..ఏ విధమైన యాక్టివిటీ లేకుండా ఉంటుంటే హార్ట్ ఎటాక్ ముప్పు అధికమౌతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే శరీరంలో యాక్టివిటీ లేనప్పుడు ధమనుల్లో అనవసర పదార్ధాలు పేరుకుపోతుంటాయి. ఇవి గుండెకు రక్త సరఫరాలో ఇబ్బందులు తీసుకొస్తాయి. గుండెకు రక్త సరఫరాలో ఎప్పుడైతే ఇబ్బంది ఏర్పడిందో..గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే ప్రతిరోజూ నిర్ణీత పద్ధతిలో వ్యాయామం అవసరం. 


హార్ట్ ఎటాక్ లక్షణాలు


ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం, చెమట్లు పట్టడం, శ్వాసలో ఇబ్బంది, వాంతులు, గొంతెండిపోవడం, తల తిరగడం, హఠాత్తుగా అలసట వంటివి ప్రధానంగా కన్పించే లక్షణాలు. ఛాతీ మధ్యలో కొన్ని నిమిషాలపాటు తీవ్రమైన నొప్పి, ఛాతీ భారంగా లేదా పట్టేసినట్టుండటం, గుండె నుంచి భుజాలు, మెడ, చేతులు, జబ్బల్లో భరించలేని నొప్పి రావడం గుండెపోటు లక్షణాలు. 


Also read: Skin Pigmentation: ఈ చిట్కాలతో పిగ్మెంటేషన్‌కు చెక్, మీ ముఖం మరింత అందంగా



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook