Skin Pigmentation: అందం కోసం మహిళలు చేయని ప్రయత్నాలుండవు. ముఖంపై ఏ మాత్రం పిగ్మెంటేషన్ సమస్య తలెత్తినా ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోతాయి. అందుకే పిగ్మంటేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన చిట్టాలు తెలుసుకుందాం..
మహిళలు ఫేస్‌బ్యూటీకు ఇచ్చే ప్రాధాన్యత మరి దేనికీ ఇవ్వరు. అందంగా ఉండాలని..ముఖంపై ఏ చిన్న మచ్చలు, పింపుల్స్ రాకుండా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ అందానికి మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిగ్నెంటేషన్ సమస్య తలెత్తితే అందమంతా పాడవుతుంది. పాతరోజుల్లో అయితే పిగ్మెంటేషన్ అనేది వయస్సు పెరిగితే వచ్చే సమస్యగానే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తక్కువ వయస్సుకే ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ద్వారా పిగ్మెంటేషన్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
పిగ్మెంటేషన్ దూరం చేసే పదార్ధాలు
తులసి ఆకులకు ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ సమస్యకు తులసి ఆకులు మంచి పరిష్కారం. తులసి ఆకుల్ని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసం కొద్దిగా కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖంపై ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. చివరిగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ లేదా వారానికి 3-4 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ఇక రెండవది జీలకర్ర. దాదాపు ప్రతి భారతీయని వంటింట్లో కచ్తితంగా ఉంటుంది. జీరకర్ర అనేది చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంపై పిగ్మెంటేషన్ నుంచి విముక్తి కల్గిస్తుంది. దీనికోసం రెండు స్పూన్ల జీలకర్రను నీళ్లలో బాగా ఉడికించాలి. వడపోయాలి. నీళ్లు చల్లారిన తరువాత ఉదయం సాయంత్రం ఫేస్‌వాష్ చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే మీ ముఖంపై మార్పు చూడవచ్చు.
ఇక మూడవ చిట్కా కర్పూరం, కర్పూరం అనేది పూజల్లో తప్పకుండా వినియోగించే వస్తువు. కర్పూరంలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ గుణాలు ఆరోగ్యానికి చాలామంచివి. కర్పూరాన్ని 6-7 స్పూన్ల నీటిలో మిక్స్ చేయాలి. ఇందులో ముల్తానీ మిట్టి, ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పిగ్మెంటేషన్ ఉన్నచోట రాసి..ఓ అరగంట ఉంచాలి. తరువాత నీళ్లతో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Weight loss Tips: రోజుకు కేవలం ఐదే ఐదు నిమిషాలు 5 ఎక్సర్‌సైజ్‌లు చేస్తే చాలు..బరువు తగ్గడం ఖాయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook