Thyroid Symptoms: మీకు థైరాయిడ్ ఉందో లేదో..ఈ లక్షణాలతో చెప్పేయవచ్చు
Thyroid Symptoms: బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ థైరాయిడ్‌కు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం థైరాయిడ్ కేసులే అధికంగా కన్పిస్తున్నాయి. థైరాయిడ్ ఎలా గుర్తించాలి, థైరాయిడ్ లక్షణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Thyroid Symptoms: బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ థైరాయిడ్‌కు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం థైరాయిడ్ కేసులే అధికంగా కన్పిస్తున్నాయి. థైరాయిడ్ ఎలా గుర్తించాలి, థైరాయిడ్ లక్షణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామందికి థైరాయిడ్ ఉన్నా తెలియదు. దాంతో థైరాయిడ్ సమస్య పెరిగిపోతుంటుంది. అందుకే థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించగలిగితే త్వరగా నియంత్రించుకోవచ్చు. మరి థైరాయిడ్ గుర్తించడం ఎలా, థైరాయిడ్ ఉంటే శరీరంలో ఏ విధమైన సమస్యలుంటాయో తెలుసుకుందాం. తద్వారా థైరాయిడ్ ముదరకముందే చికిత్సతో నయం చేసుకోవచ్చు.
థైరాయిడ్ ఎలా గుర్తించాలి, లక్షణాలేంటి
థైరాయిడ్ సమస్య ఉంటే స్థూలకాయం వెంటాడుతుంది. ప్రస్తుత తరుణంలో థైరాయిడ్ అనేది సాధారణమైపోయింది. సాధారణంగా అయోడిన్ లోపంతో థైరాయిడ్ సమస్య వస్తుంటుంది. ఎక్కువగా మహిళల్లో కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో మహిళలు బరువు పెరిగిపోతుంటారు. దాంతోపాటు శరీరం బలహీనమైపోతుంది. స్థూలకాయం ఏర్పడుతుంది. దాంతో పలు వ్యాధులు సంక్రమిస్తాయి.
థైరాయిడ్‌ను ఎలా నియంత్రించడం
థైరాయిడ్ నుంచి విముక్తి పొందేందుకు తులసి ఆకుల రసం తీసి..అందులో ఒక స్పూన్ అల్లోవెరా జ్యూస్ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణవుతుంది. అంతేకాకుండా తులసి టీతో కూడా మంచి ఫలితాలుంటాయి. డీకాషన్‌లో తులసి ఆకులు వేసి తాగవచ్చు. ఇలా కూడా థైరాయిడ్ నియంత్రించవచ్చు.
Also read: Brown Rice Benefits: బ్రౌన్ రైస్‌తో స్థూలకాయం, అధిక రక్తపోటుకు పూర్తిగా చెక్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook