చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి శరీరంలో వివిధ సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణమిదే. అనవసరమైన పదార్ధాలు శరీరంలో చేరడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫాస్ట్‌ఫుడ్స్ లేదా ప్రోసెస్డ్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే..ఆ కొలెస్ట్రాల్ ప్రాణాంతకం కావచ్చు. క్రమంగా అది స్ట్రోక్, బ్లాకేజ్‌కు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఓ రకమైన కొవ్వు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది శరీరానికి మంచిదే కానీ పరిమితి మించితే ప్రాణాంతకమౌతుంది. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా ముఖ్యం. ఆహారంలో కొన్ని పదార్ధాలు చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు.


డ్రై ఫ్రూట్‌తో కొలెస్ట్రాల్ నియంత్రణ


చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. 


సోయాబీన్‌తో ఉపయోగాలు


సోయాబీన్ అనేది చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా దోహదపడుతుంది. సోయాబీన్స్ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా..ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కండరాల పటిష్టతకు చాలా మంచిది. 


ఆనపకాయ కూర


శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఆనపకాయ సరైన ప్రత్యామ్నాయం. మరోవైపు క్యారట్, నిమ్మకాయ, ఆరెంజెస్ కూడా వాడవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ జీర్ణమైపోతుంది. గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. 


Also read: Frequent Urination: తరచూ మూత్రం వస్తోందా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook