Frequent Urination: తరచూ మూత్రం వస్తోందా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు

శరీరంలోపల ఉండే సమస్యలు వివిధ రూపాల్లో బహిర్గతమౌతుంటాయి. ఇందులో ప్రధానమైంది. అధిక మూత్రం. రోజుకు 4-5 సార్లు మూత్రం రావడమనేది సహజమే. కానీ అంతకంటే ఎక్కువ అంటే తరచూ మూత్రానికి వెళ్లడం మాత్రం సాధారణం కానేకాదు. ప్రమాదకర, గంభీరమైన వ్యాధులకు కారణం కావచ్చు. నేరుగా కిడ్నీలపై ప్రభావం ఉండేది కావచ్చు. అంతే కాదు..కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కూడా కావచ్చు. అధిక యూరినేషన్ ఎలాంటి వ్యాధులకు కారణమో తెలుసుకుందాం..

Frequent Urination: శరీరంలోపల ఉండే సమస్యలు వివిధ రూపాల్లో బహిర్గతమౌతుంటాయి. ఇందులో ప్రధానమైంది. అధిక మూత్రం. రోజుకు 4-5 సార్లు మూత్రం రావడమనేది సహజమే. కానీ అంతకంటే ఎక్కువ అంటే తరచూ మూత్రానికి వెళ్లడం మాత్రం సాధారణం కానేకాదు. ప్రమాదకర, గంభీరమైన వ్యాధులకు కారణం కావచ్చు. నేరుగా కిడ్నీలపై ప్రభావం ఉండేది కావచ్చు. అంతే కాదు..కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కూడా కావచ్చు. అధిక యూరినేషన్ ఎలాంటి వ్యాధులకు కారణమో తెలుసుకుందాం..

1 /5

తరచూ యూరిన్ రావడమనేది యూరినరీ ట్రాక్ ఇన్‌‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు. మూత్రాశయంలో లేదా మూత్రమార్గంలో ఇన్‌ఫెక్షన్ కావచ్చు. మూత్రం పోసేటప్పుడు నొప్పిగా ఉంటుంది.

2 /5

మగవారిలో యూరిన్ ఎక్కువగా రావడం ప్రోస్టేట్ గ్రంథి పెరగడానికి కారణం కావచ్చు. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మూత్రమార్గంలో ఇబ్బంది ఉంటుంది. తరచూ మూత్రం వస్తుంది. 

3 /5

మూత్రం ఎక్కువగా రావడం అనేది కిడ్నీలో రాళ్లకు లక్షణం కావచ్చు. మూత్రం వెళ్లేమార్గంలో ఇబ్బంది ఉంటే..తరచూ మూత్రం సమస్య ఉంటుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా మూత్రం వెళ్లేమార్గంలో ఇబ్బంది ఉంటుంది.

4 /5

కిడ్నీలోనే యూరిన్ తయారవుతుంది. కిడ్నీలో సమస్య ఉంటే యూరిన్ తయారీలో సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ సంబంధం నేరుగా యూరిన్‌తో ముడిపడి ఉంటుంది. అందుకే యూరిన్ ఎక్కువగా వస్తుంటే కిడ్నీ వ్యాధి లక్షణం కావచ్చు.

5 /5

డయాబెటిస్ వ్యాధి ఉన్నప్పుడు కూడా మూత్రం ఎక్కువగా వస్తుంది. డయాబెటిస్ ఉంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. యూరిన్ ద్వారా గ్లూకోజ్ బయటకు పోతుంటుంది.