Acidity and Gas: వర్షాకాలంలో కన్పించే ప్రధానంగా కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే..వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. ఆయిలీ ఫుడ్ లేదా వ్యర్ధ పదార్ధాలు తినడం వల్ల నేరుగా కడుపుపై ఆ ప్రభావం కన్పిస్తుంది. బయటి తిండి తినడం వల్ల సహజంగానే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు చాలా సందర్భాల్లో ఖాళీ కడుపున కాఫీ, టీ లేదా మద్యం తాగుతుంటాం. ఈ పద్ధతి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఉన్నట్టుంది కడుపులో నొప్పి లేదా కడుపులో గడబిడ సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా..ప్రతి వంటింట్లో లభించే కొన్ని పదార్ధాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చు.


బెల్లం దాదాపు అందరికీ ఇష్టమైనదే. బెల్లం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చాలామందికి తెలియదు. అందుకే భోజనం తరువాత కొద్దిగా బెల్లం తింటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేద వైద్య గ్రంధాల్లో కూడా బెల్లం ప్రస్తావన ఉంది. 


మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చలవ చేస్తుంది. అందుకే వేడి చేసినప్పుడు లేదా వేసవికాలంలో ఎక్కువగా మజ్జిగ తాగుతుంటారు. దీనివల్ల కడుపులో చల్లగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి.


సోంపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సోంపును ఎక్కువగా నేచురల్ మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగిస్తుంటారు. దాంతోపాటు భోజనం రుచి పెంచేందుకు కూడా సోంపు వాడుతుంటారు. ఎసిడిటీ దూరం చేసేందుకు సోంపు నీళ్లు బాగా పనిచేస్తాయి.


దాల్చినచెక్క నిజంగా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసు. సాధారంగా మసాలాలో వాడుతుంటారు. కానీ గ్యాస్, ఎసిడిటీ సమస్యను దూరం చేసేందుకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న దాల్చినచెక్క ముక్కల్ని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగాలి. 


ఇక మరో ముఖ్యమైంది లవంగాలు. ఇది కూడా మసాలా దినుసే. కానీ ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు లవంగ తినడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. కడుపులో ఏర్పడే వివిధ రకాల సమస్యలు దూరమౌతాయి.


Also read; White Hair on Face: ముఖంపై తెల్ల వెంట్రుకల నుంచి విముక్తి ఎలా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook