White Hair on Face: అందం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఒక్కోసారి ముఖంపై కూడా తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు లేదా చిట్కాలు పాటిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు తెల్లబడటం. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన కారణంగా జుట్టు త్వరగానే నెరిసిపోతోంది. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడైతే ముఖంపై కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. సాధారణంగా మెలానిన్ లోపంతో ఫేషియర్ హెయిర్ తెల్లబడుతుంటుంది. శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి కారణమంటున్నారు వైద్య నిపుణులు. ముఖంపై తెల్ల వెంట్రుకలు కన్పిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే దూరం చేసుకోవచ్చు..
1. తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మంచిది. తేనెలో కాస్త పంచదార మిక్స్ చేసి..ముందుగా వేడి చేయాలి. చల్లారిన తరువాత నిమ్మకాయ పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే అవాంఛిత తెల్ల వెంట్రుకల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
2. మార్కెట్లో మహిళల కోసం చాలా రకాల ఫేషియల్ రేజర్లు లభ్యమౌతున్నాయి. ముఖంపై ఏర్పడే అవాంఛిత తెల్ల వెంట్రుకల్ని తొలగించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ముఖం డ్రై అవకుండానే రేజర్ ఉపయోగించాలి.
3. ఎప్లికేటర్ సహాయంతో ముఖంపై తెల్ల వెంట్రుకల్ని తొలగించుకోవచ్చు. ఎప్లికేటర్ సహాయంతో నొప్పి లేకుండా సులభంగా తొలగించుకోవచ్చు.
4. లేజర్ హెయిర్ రిమూవల్ సహాయంతో ముఖంపై తెల్ల వెంట్రుకల్ని తొలగించవచ్చు. అయితే ప్రొఫెషనర్ బ్యూటీ పార్లర్‌లోనే ఇది సాధ్యపడుతుంది. లేకపోతే ముఖానికి హాని చేకూరుతుంది.
5. త్రెడింగ్..అనేది ఓ సహజమైన విధానమే. బ్యూటీ పార్లర్లలో అవలంభించే ప్రక్రియ ఇది. త్రెడింగ్ సహాయంతో తెల్లవెంట్రుకల్ని సులభంగా తొలగించుకోవచ్చు. దారం సహాయంతో వీటిని తొలగించవచ్చు.
Also read: Acidity: ఎసిడిటీ సమస్య నుంచి ఇలా 2 నిమిషాల్లో ఉపశమనం పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook