Heart Attack vs Panic Attack: హార్ట్ ఎటాక్ , పానిక్ ఎటాక్ మధ్య తేడా ఏంటి, ఎలా గుర్తించాలి
Heart Attack vs Panic Attack: మనిషి గుండె కొట్టుకున్నంతసేపే ఆ ప్రాణం నిలబడుతుంది. మనిషి జీవించి ఉండేది. ఒకసారి ఆగిందంటే అంతే..అంతా నిర్జీవమే ఇక. మనిషి శరీరంలో గుండె అంత ముఖ్యమైన అంగం. అందుకే గుండెను చాలా భద్రంగా చూసుకోవాలి.
Heart Attack vs Panic Attack: ఇటీవలి కాలంలో గుండె పోటు కేసులు ఎక్కువగా విన్పిస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే గుండెపోటు కారణంగా ప్రాణాలు పోతున్నాయి. గుండెపోటు ఇటీవలి కాలంలో అత్యధికంగా సంభవిస్తున్న అనారోగ్య సమస్యగా మారుతోంది. తక్కువ వయస్సుకే గుండెపోటుకు గురవుతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి.
ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి పానిక్ ఎటాక్. రెండవది హార్ట్ ఎటాక్. రెండింటికీ తేడా ఉంది. చాలామంది పానిక్ ఎటాక్‌ని హార్ట్ ఎటాక్ అని పొరబడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. మరి ఈ రెండింటికీ మధ్య అంతరాన్ని ఎలా గుర్తించాలి, ఏది హార్ట్ ఎటాక్, ఏది పానిక్ ఎటాక్ అనేది ఎలా తెలుసుకోవాలి..మెడికల్ పరిజ్ఞానం ప్రకారం హార్ట్ ఎటాక్ అనేది చాలా విషమమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో మనిషి గుండె వరకూ రక్తాన్ని చేర్చే ధమనుల్లో సమస్య తలెత్తుతుంది. లేదా ధమనులు బ్లాక్ కావచ్చు. ఈ సమయంలో బాడీ పెయిన్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , అలసట ఉంటుంది.
హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి
హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం ఆర్టరీస్ కుదించుకుపోవడం. ఇది గుండె కండరాలకు హాని కల్గిస్తుంది. ఫలితంగా గుండెకు అవసరమైన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందడంలో ఆటంకం కలుగుతుంది. ఆర్టరీస్ పేరుకునే కొలెస్ట్రాల్ వల్ల ఇలా జరుగుతుంది.
హార్ట్ ఎటాక్ తలెత్తినప్పుడు తప్పనిరిగా వైద్యునితో చికిత్స తీసుకోవాలి. మందులు వాడాల్సి ఉంటుంది. హెల్తీ లైఫ్‌స్టైల్ అనుసరించాలి. హెల్తీ లైఫ్‌స్టైల్ అంటే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం, హెల్తీ ఫుడ్స్, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి పాటించాల్సి ఉంటుంది. మందులు వాడటంతో పాటు మానసిక చికిత్స, యోగా, ధ్యానం వంటివి ఉన్నాయి.
పానిక్ ఎటాక్ అంటే ఏమిటి
పానిక్ ఎటాక్ అంటే ఓ రకమైన ఆందోళనకు గురి కావడం లేదా తీవ్రమైన బెంగ. ఇదొక రకమైన మానసిక ఒత్తిడి కావచ్చు లేదా భయం వల్ల ఏర్పడేది కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరగడం, శ్వాసలో ఇబ్బంది రావడం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, చెమట పట్టడం, ఒత్తిడి ఉంటాయి. ఈ స్థితి చాలా భయంకరమైంది. వ్యక్తిని నియంత్రించడం కష్టమౌతుంది.
మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ధూమపానం, కెఫీన్ ఎక్కువగా సేవించడం, మద్యపానం వల్ల పానిక్ ఎటాక్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు తగిన చికిత్స తీసుకుని మందులు వాడాలి. ఏదైనా ప్రశాంత వాతావరణంలో రోగిని మార్చాలి. ఈ పరిస్థితిలో మానసిక చికిత్స కూడా అవసరమౌతుంది. రోజూ తగిన వ్యాయమం చేయడం, యాంటీ డిప్రెజెంట్ మందులు వాడటం, హెల్తీ ఫుడ్ తినడం వంటివి చేయాలి. రోజూ తగినంత నిద్ర కూడా అవసరం. నీళ్లు ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా రాత్రి నిద్ర 7-8 గంటలు కచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Jelly Belly Cancer: ఈ సాధారణ లక్షణాలు జెల్లీ బెల్లీ కేన్సర్ కావచ్చేమో, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook