మెంతుల్లో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. మెంతులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. కానీ మెంతులతో నష్టాలు కూడా ఉన్నాయి. ఏ మాత్రం తెలుసుకోకపోతే కొంప ముంచేస్తాయి జాగ్రత్త.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెంతుల్లో ఉండే పోషక పదార్ధాలు, ఔషధ గుణాల కారణంగా మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణకు విరివిగా ఉపయోగిస్తుంటారు. కానీ మెంతులతో కొంతమందికి నష్టం కూడా కలుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా మెంతి టీ తాగడం వల్ల పరిస్థితులు వికటించి ప్రాణాంతకం కూడా కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతి టీ ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..


మెంతి తాగడం జీర్ణక్రియకు చాలా మంచిది కానీ డయేరియా సమస్య ఉంటే మాత్రం మెంతి టీ తాగడం వల్ల పరిస్థితి మరింతగా విషమిస్తుంది. అదే సమయంలో అజీర్తి, మలబద్ధకం సమస్యలకు మెంతి టీ అద్భుతమైన ఔషధమే.


గర్భిణీ మహిళలకు..


గర్భిణీ స్త్రీలు మెంతి టీ తాగడం హాని చేకూరుస్తుంది. గర్భిణీ మహిళలు మెంతి టీ తాగకూడదు. మెంతి టీ వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే మెంతి టీకు దూరంగా ఉండాలి.


బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు అంటే లోషుగర్ రోగులు మెంతి టీ తాగడం ప్రమాదకరం కావచ్చు. మెంతుల్లో ఉండే న్యూట్రియంట్లు షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. అందుకే లోషుగర్ ఉన్నవాళ్లు మెంతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. దీనివల్ల షుగర్ లెవెల్స్ మరింతగా పడిపోతాయి.


మెంతులు లేదా మెంతి టీ అనేది పిల్లలకు మంచిది కాదు. ఆరోగ్యపరంగా హాని కల్గిస్తుంది. మెంతి టీ లేదా మెంతులు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా చిన్నారుల్లో బలహీనత ఏర్పడుతుంది. మెంతి టీ తాగడం వల్ల యూరిన్‌లో దుర్వాసన సమస్య ఉంటుంది.


మెంతులతో కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. ఫలితంగా లివర్‌పై దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఎలర్జీ ఉండేవాళ్లు మెంతులకు దూరంగా ఉండాలి. మెంతి టీ అస్సలు ముట్టుకోకూడదు.


మెంతుల్లో ఉండే పోషక పదార్ధాలు రక్తాన్ని పలుచన చేస్తాయి. మెంతులతో బ్లడ్ కాటింగ్ సమస్య ఏర్పడవచ్చు. మెంతి టీ తాగడం వల్ల బ్లీడింగ్ సమస్య పెరుగుతుంది. ఏదైనా సర్జరీ చేయించున్నవాళ్లు మెంతులకు దూరంగా ఉండాలి.


Also read: Ginger Milk: చలికాలంలో రోజూ అల్లం పాలు తీసుకుంటే..కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook