Weak Bones Signs: ఎముకలు బలహీనపడనంతకాలం వయస్సు మీరినా మనిషి ఫిట్‌గా ఉంటాడు. ఎందుకంటే యాక్టివ్, హెల్తీ లైఫ్‌స్టైల్ కొనసాగించాలంటే ఎముకలు బలంగా ఉండాల్సిందే. ఇవి శరీరంలోని ముఖ్యమైన అంగాలకు రక్షణ కల్పిస్తాయి. శరీర నిర్మాణంలో ఎముకల పాత్ర, ఆవశ్యకత గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎముకలు సజీవమైన టిష్యూతో నిర్మితమై ఉండటం వల్ల తరచూ విరుగుతుంటాయి. ఇందులో ఉండే రీమోడలింగ్ ప్రక్రియతో తిరిగి పునర్నిర్మితమౌతుంటాయి. యౌవనంలో ఉన్నప్పుడు శరీరంలోని ఎముకలు వేగంగా వృద్ధి చెందుతుంటాయి. దాంతో ఎముకల డెన్సిటీ పెరుగుతుంది. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఎముకల పెరుగుదల కంటే హాని ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎముకలు బలహీనమైపోతుంటాయి. ఎముకలు బలహీనమైనప్పుడు ముఖ్యంగా 3 సంకేతాలు కన్పిస్తాయి. ఆ సంకేతాలేంటో చూద్దాం..


బ్యాక్ పెయిన్:


ఒకవేళ బ్యాక్ పెయిన్ లేదా మెడ నొప్పి తరచూ ఉంటుంటే ఎముకల బలహీనపడుతున్నాయనేందుకు సంకేతం. బలహీనమైన ఎముకల కారణంగా వెన్నుపూసలో ఫ్రాక్చర్ లేదా ఒత్తిడి కారణంగా నొప్పి ఉండవచ్చు


ఫ్రాక్చర్ అవుతుండటం:


ఎముకలు బలహీనంగా ఉన్నవారిలో తరచూ ఫ్రాక్చర్ ఘటనలు ఎదురౌతుంటాయి. ఏ మాత్రం చిన్నగా జారి పడినా సరే ఎముకలు విరిగిపోతుంటాయి. ఈ పరిస్థితి ఎముకల బలహీనతకు సంకేతమే.


హైట్ తగ్గడం:


వయస్సు పెరిగే కొద్దీ ఎముకల డెన్సిటీ తగ్గి బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎత్తు తగ్గుతుంది. ఎందుకంేట వెన్నుపూస ఎముక కుదించుకుపోతుంటుంది. ఇదంతా మీ ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది. ఎముకల బలహీనతకు ఇది ఓ సంకేతం.


గోర్లు పెళుసుగా మారడం:


ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల గోర్లు పెళుసుగా మారిపోతుంటాయి. దాంతో సులభంగా విరిగిపోతాయి. ఎందుకంటే మీ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలే గోర్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.


పోశ్చర్:


ఎముకల బలహీనత మీ పోశ్చర్‌లో మార్పు తీసుకొస్తుంది. మీ వెన్నెముక ఎముక బలహీమంగా మారడం వల్ల అది కుదించుకుపోతుంది. దాంతో మీకు తెలియకుండానే మీరు వంగిపోతారు. ఇది నిస్సందేహంగా ఎముకల బలహీనతకు నిదర్శనం.


Also Read: Healthy Drink: వాటర్ మెలన్ మిల్క్ షేక్‌తో కేవలం 5 వారాల్లో బరువు తగ్గడం ఖాయం, ట్రై చేసి చూడండి


Also Read: Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook